Telegram Live stream: టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్లు.. అపరిమిత లైవ్ స్ట్రీమింగ్‌తోపాటు.. 
close

Published : 02/09/2021 23:10 IST
Telegram Live stream: టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్లు.. అపరిమిత లైవ్ స్ట్రీమింగ్‌తోపాటు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి నెలా కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్‌లకు విభిన్నంగా యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది టెలిగ్రామ్‌. గత నెలలో వెయ్యి మంది ఒకేసారి గ్రూప్‌ వీడియో కాలింగ్‌లో పాల్గొనే ఫీచర్‌ను పరిచయం చేసిన టెలిగ్రామ్‌ తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. వీటిలో అన్‌లిమిటెడ్ లైవ్‌ స్ట్రీమ్‌, ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్, జంప్‌ టు నెక్ట్స్ ఛానెల్, ట్రెండింగ్ స్టిక్కర్స్‌ వంటివి ఉన్నాయి. మరి వీటితో యూజర్‌కి ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం. 

అన్‌లిమిటెడ్ లైవ్ స్ట్రీమింగ్

వీడియో కాలింగ్ తరహాలోనే ఇందులో కూడా అపరిమిత సంఖ్యలో యూజర్స్ పాల్గొనవచ్చు. అంటే టెలిగ్రామ్‌లో మనం ఏదైనా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే దాన్ని కూడా అపరిమిత సంఖ్యలో యూజర్స్‌ చూడొచ్చు. అలానే యూజర్స్ కార్యక్రమం మధ్యలో మాట్లాడాలనుకుంటే హ్యాండ్‌ సింబల్‌ పోస్ట్‌ చెయ్యాలి. అందుకు కార్యక్రమం నిర్వహించేవారు అనుమతిస్తే సదరు యూజర్‌ కూడా మాట్లాడొచ్చు. దీని ద్వారా యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర టెలిగ్రామ్‌ యూజర్స్‌తో సులువుగా లైవ్‌లో సంభాషించవచ్చని టెలిగ్రామ్‌ తెలిపింది. 

ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్‌

మెసేజ్ ఫార్వాడింగ్‌కు సంబంధించి మరో కొత్త ఫీచర్‌ను టెలిగ్రామ్‌ తీసుకొచ్చింది. అదే ఫ్లెక్సిబుల్ ఫార్వాడింగ్. దీంతో యూజర్‌ తనకు వచ్చిన మెసేజ్‌ల నుంచి పంపిన వారి పేరు, ఫొటోతోపాటు ఉన్న మెసేజ్‌ని డిలీట్‌ చేసి పంపొచ్చు. గతంలో మనం ఇతరులకు ఫార్వార్డ్ చేసే మెసేజ్‌ మనకు ఎవరు పంపారనేది కూడా తెలుస్తుంది. ఇక మీదట ఫార్వార్డ్‌ మెసేజ్‌లలో ఆ వివరాలు కనిపించవు. ఇందుకోసం ఫార్వార్డ్‌ మెసేజ్‌పై క్లిక్‌ చేస్తే హైడ్ సెండర్‌ నేమ్‌, హైడ్ క్యాప్షన్ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేస్తే కేవలం ఫొటో మాత్రమే ఫార్వార్డ్ అవుతుంది. 

టెలిగ్రామ్‌లో న్యూస్‌, ఈవెంట్స్‌, కంటెంట్‌కి సంబంధించి ఎన్నో రకాల ఛానెల్స్ ఉంటాయి. గతంలో ఒక ఛానెల్ చూడాలంటే మనం చూస్తున్న ఛానెల్‌ నుంచి బయటికొచ్చి కొత్త ఛానెల్‌ను ఓపెన్ చెయ్యాల్సిందే. జంప్‌ టు నెక్ట్స్ ఛానెల్‌ ఫీచర్‌తో మీరు ఏదైనా ఛానెల్ చూస్తున్నప్పుడు కిందకి స్క్రోల్‌ చేస్తే కొత్త ఛానెల్‌కి సంబందించిన అన్‌రీడ్ నోటిఫికేషన్స్ మీకు చూపిస్తుంది. వాటిపై మీరు క్లిక్ చేస్తే సదరు ఛానెల్‌లోని కంటెంట్ ఓపెన్ అవుతుంది. అలా మీరు టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసుకున్న జాబితా ప్రకారం కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన జాబితా చూపిస్తుంది. అలానే మనం ఇతరులకు మెసేజ్ పంపినప్పుడు వాళ్లు టెక్ట్స్‌తో రిప్లై ఇస్తున్నారా లేక స్టిక్కర్‌తో రిప్లై ఇస్తున్నారా అనేది తెలిసేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దాంతో పాటు కొత్త యానిమేటెడ్ ఎమోజీస్‌, స్టిక్కర్స్‌ని టెలిగ్రామ్‌ విడుదల చేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న