
ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంట వడ్డింపు
ఈనాడు, హైదరాబాద్: శిక్షణ పొందుతున్న అఖిల భారత సర్వీసు అధికారులు వంటల్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల వంటలతో ప్రత్యేకత చాటుకున్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీసెస్‌కు చెందిన 140 మంది అధికారులు బుధవారం వంట వడ్డింపు కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలోని అధికారులు తమ తమ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తయారు చేసే వంటకాలను చేశారు. వీటిని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బి.పి.ఆచార్య, అదనపు డీజీ హర్‌ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు