Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103488
            [news_title_telugu_html] => 

కవిత ఓటమితోనే తెరాస పతనం 

[news_title_telugu] => కవిత ఓటమితోనే తెరాస పతనం  [news_title_english] => [news_short_description] => ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, నిజామాబాద్‌ పార్లమెంటు తెరాస అభ్యర్థి కవిత ఓటమితోనే తెరాస పతనం ఆరంభమైందని చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్‌ పరాజిత అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-26 03:07:25 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కవిత ఓటమితోనే తెరాస పతనం  - EENADU
close

తాజా వార్తలు

కవిత ఓటమితోనే తెరాస పతనం 

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, నిజామాబాద్‌ పార్లమెంటు తెరాస అభ్యర్థి కవిత ఓటమితోనే తెరాస పతనం ఆరంభమైందని చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్‌ పరాజిత అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నివాస గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే కవిత ఓటమి చెందారన్నది గుర్తించి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పారు. తనపై తెరాస ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో తప్పుడు కేసులు బనాయించి అడుగడుగునా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులు పెట్టిందన్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పరాజయం చెందినా..పెద్దగా బాధపడటం లేదని, విజయం సాధించి ఉంటే ఆరు మాసాలు దిల్లీలో, ఆరు మాసాలు ప్రజల మధ్య ఉండేవాడినని, ప్రస్తుతం ఏడాది పొడుగునా ప్రజల వెంటే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి, కె.ఎస్‌.రత్నంలను తెరాసలో చేర్చుకున్నారని అన్నారు. వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, శాసనసభ ఎన్నికల కంటే 50 వేలు అధికంగా ఓట్లు వేశారని తెలిపారు.

*చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలు మహాభారత యుద్ధాన్ని తలపించాయని, ఐదుగురు పాండవులు కాంగ్రెస్‌ వైపు, నూరుమంది కౌరవులు తెరాస వైపు ఉండి పోరాటం చేశారని అభివర్ణించారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మైనార్టీ సోదరులంతా భారీ మద్దతు తెలిపారని, ఎంఐఎం అధినేత మాటలను విశ్వసించి రాజేంద్రనగర్‌, మహేశ్వరం ప్రాంతాల్లోని మైనార్టీలు తెరాసకు మద్దతు పలికారన్నారు. 
*మైనార్టీలు అధికంగా ఉన్న రాజేంద్రనగర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో 532 ఓట్లు పోలైతే, 32 ఓట్లు మాత్రమే తనకు పడ్డాయన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటానని, వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలిపే వరకు మరో ఉద్యమం ప్రారంభిస్తానని అన్నారు. 
* కార్యక్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు కిషన్‌నాయక్‌, కమాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రఘువీరారెడ్డి, శ్రీనివాస్‌ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.