Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమాన్‌పూర్‌, న్యూస్‌టుడే: చెరువులో దిగిన పశువులను ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయతిస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి పశువుల కాపరి మృతి చెందిన సంఘటన కమాన్‌పూర్‌ మండలం జూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...జూలపల్లి గ్రామానికి చెందిన చిట్యాల మల్లేష్‌(50) గ్రామంలోని పశువులను కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం పశువులను మేత కోసం గ్రామంలోని పెద్దచెరువు సమీపంలోకి తీసుకువెళ్లాడు. కొన్ని పశువులు చెరువులో దిగి పైకి రాకపోవడంతో వాటిని ఒడ్డుకు తీసుకునివచ్చేందుకు మల్లయ్య అందులో దిగాడు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, మల్లేష్‌కు ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. మల్లేష్‌కు భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉంది. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమాన్‌పూర్‌ ఎస్‌ఐ అన్నెవేని మల్లేశం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన