KGBV Admissions: ఏపీ కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీలోని కేజీబీవీల్లో 6, 11తో పాటు పలు తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటినుంచి మొదలుకానుంది.

Published : 12 Mar 2024 18:12 IST

üAP KGBV Admissions | అమరావతి: ఏపీలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (KGBV) 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. 6, 11వ తరగతుల్లో కొత్తగా ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( మధ్యలో బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. కేజీబీవీ అధికారిక వెబ్‌సైట్‌ https://apkgbv.apcfss.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలు మించరాదు. 

ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్‌ ఇదే.. ఏ రోజు ఏ పరీక్షో తెలుసా?

షెడ్యూల్‌ ఇదే..

మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సెలక్షన్‌ జాబితా ఏప్రిల్‌ 15 నాటికి సిద్ధమవుతుంది.  ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్‌ చేసి.. ఏప్రిల్‌ 19న జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌లో సమాచారం ఇస్తారు. ఏప్రిల్‌ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేస్తారు. మరిన్ని వివరాలను RTE టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258599 సంప్రదించవచ్చని సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని