AP DSC: ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్‌ ఇదే.. ఏ రోజు ఏ పరీక్షో తెలుసా?

ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షల పూర్తి వివరాలివే..

Updated : 12 Mar 2024 19:31 IST

AP DSC Schedule | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో 6,100 ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రకటించిన డీఎస్సీ (AP DSC) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి  15 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా.. హైకోర్టు జోక్యంతో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌ టేబుల్‌ను రూపొందించారు.

మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 7న ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్న అధికారులు.. 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని