AP DSC Applications: ఏపీ డీఎస్సీ దరఖాస్తులు షురూ.. క్లిక్‌ చేయండి

ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Updated : 12 Feb 2024 20:28 IST

AP DSC 2024 Online Applications | అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ 6,100 పోస్టుల భర్తీకి ఇటీవల హడావుడిగా షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొత్తం ఉద్యోగాల్లో 2,280 ఎస్జీటీ పోస్టులు ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 చొప్పున ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలువుతుందని చెప్పిన ప్రభుత్వం ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్‌ను మాత్రం సోమవారం రాత్రి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి 

AP DSC 2024 పరీక్షకు మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి.  సెషన్‌ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; సెషన్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్‌ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటిస్తారు. 2018 డీఎస్సీ సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు.

జిల్లాల వారీగా పోస్టులు ఇలా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని