CTET 2024 Key: సీటెట్‌ ‘ప్రాథమిక కీ’ విడుదల

జనవరిలో నిర్వహించిన సీటెట్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 10లోపు తెలపవచ్చు.

Published : 07 Feb 2024 21:52 IST

CTET 2024 Key Released | దిల్లీ:  కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-jan 2024) ప్రాథమిక కీ విడుదలైంది. జనవరి 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన 18వ ఎడిషన్‌ సీటెట్‌ రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లు, ప్రాథమిక కీని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఫిబ్రవరి 10 అర్ధరాత్రి వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది.

అయితే, ఒక్కో ప్రశ్నకు రూ.1000 చొప్పున (నాన్‌ రిఫండ్‌) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పేపర్‌ 1 పరీక్ష (1 నుంచి 5వ తరగతి)కు 9,58,193 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. పేపర్‌ 2 పరీక్ష (6 నుంచి 8వ తరగతి)కు 17,35,333 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 135 నగరాల్లో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.

కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు