TS News: డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రారంభం..

ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వెల్లడించారు.

Updated : 11 Sep 2023 20:12 IST

హైదరాబాద్‌: ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వెల్లడించారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.

మూల్యాంకనంపై ఐఎస్‌బీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలో నాలుగో సెమిస్టర్‌లో సైబర్ సెక్యూరిటీని నాలుగు క్రెడిట్లతో ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, పలువురు వీసీ, ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు