Mrunal Thakur: మృణాల్‌ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు

హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Published : 05 May 2024 13:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల్లో ఆయా పాత్రలకు తగ్గట్టు ఎంత ట్రెడిషనల్‌గా ఉంటారో తెర వెనుక అంత ట్రెండీగా ఉంటారు మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ముంబయి వేదికగా శనివారం జరిగిన ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. రెడ్‌ కలర్‌ లెహంగాలో హొయలొలికించారు. స్టైలిష్‌ అవుట్‌ఫిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. వేదికపై మాట్లాడుతూ.. ఆ క్రెడిట్‌ని తన డిజైనర్‌ అనుకి ఇచ్చారు. ముత్యాలు పొదిగిన ఆ డ్రెస్సును రూపొందించేందుకు ఆమెకు 1400 గంటల సమయం పట్టిందని తెలిపారు. తనకు ర్యాంప్‌ వాక్‌ చేయడం ఇష్టమని చెప్పారు. సంబంధిత ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. ‘వావ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎక్స్‌ (ట్విటర్‌)లో #MrunalThakur హ్యాష్‌ట్యాగ్‌ సైతం ట్రెండింగ్‌లో నిలిచింది.

బాలీవుడ్‌లో ‘సూపర్‌ 30’, ‘జెర్సీ’ తదితర సినిమాలతో అలరించిన ఆమె ‘సీతారామం’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. తర్వాత ‘హాయ్‌ నాన్న’తో మెప్పించిన ఆమెకు ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ‘పూజా మేరీ జాన్‌’ (హిందీ)లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని