ఇంజినీరింగ్‌లో  ఇవి ప్రత్యేకం!

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన బీటెక్‌/ బీఈ కోర్సులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ అత్యాధునిక టెక్నాలజీలకున్న ఆదరణ, విస్తృతి, ప్రయోజనాల దృష్ట్యా  బీటెక్‌ స్థాయిలో ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి.

Published : 12 Oct 2020 00:33 IST

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన బీటెక్‌/ బీఈ కోర్సులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ అత్యాధునిక టెక్నాలజీలకున్న ఆదరణ, విస్తృతి, ప్రయోజనాల దృష్ట్యా  బీటెక్‌ స్థాయిలో ఎన్నో కళాశాలలు వీటిని ప్రవేశపెడుతున్నాయి.

ఇటీవలి కాలంలో వివిధ పరిశ్రమల ఉద్యోగ నియామకాల్లో గుణాత్మకంగా మార్పు వచ్చింది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ప్రాథమిక పరిజ్ఞానానికి బదులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌లో నిర్దిష్ట నైపుణ్యం ఉన్నవారివైపే నియామక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌లోనే కాకుండా ఇంజినీరింగ్‌లోని అన్ని రంగాల్లో ఈ అత్యాధునిక టెక్నాలజీల ప్రమేయం విస్తృతంగా ఉంది. వీటి ప్రమేయంలేని ఇంజినీరింగ్‌ బ్రాంచీనే లేదని చెప్పాలి.
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, సేవతో కూడిన ఉద్యోగాల్లో ‘ఇంజినీరింగ్‌’ ఒకటని చెప్పొచ్చు. ఏ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉపాధి లేదా ఉద్యోగం దొరికినా మంచి జీతంతోపాటు ఆత్మసంతృప్తి కూడా దక్కుతాయి. ఇంజినీరింగ్‌ డిగ్రీ కేవలం సాంకేతిక అంశాలనే కాకుండా కార్యనిర్వహణ, వ్యాపార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సంభాషణ నైపుణ్యం వంటివి కూడా నేర్పిస్తుంది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
ఒక వ్యక్తి ఏ ఇంజినీరింగ్‌ డిగ్రీ తీసుకున్నా జీవితంలో స్థిరపడటానికీ, రాణించడానికీ కావాల్సిన అన్ని అంశాలూ నేర్చుకోగలుగుతాడు.
ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, బయోమెడికల్‌, ఫార్మాస్యూటికల్‌ తదితర అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ ఈ సాంకేతికతలు అంతర్గతంగా ఉండి, ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలతోపాటు ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించడం ద్వారా స్వయంచాలక వాహనాలు, ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్స్‌, కెమికల్‌ ప్రాసెస్‌ పరిశ్రమలు, సమర్థ వ్యవసాయం వంటి ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది.

కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ విభాగాలు ప్రాథమిక ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఏఐ, డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటివి ఐటీ ఆధారిత అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అందువల్ల ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ ఈ ఆధునిక కోర్సుల్లో కొంతైనా అవగాహన ఉండాల్సిందే!

సమగ్ర కథనం, జియో సైంటిస్ట్‌ నియామకాల కథనం epaper.eenadu.net


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని