పరికరాల రూపకల్పనకు ఫెలోషిప్‌లు

వైద్య, బయో మెడికల్‌ రంగాలకు ఉపయోగపడే వినూత్న పరికరాల డిజైన్‌, సేవల కోసం ఒక ఫెలోషిప్‌ లభిస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన హెల్త్‌కేర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ ఈ

Updated : 30 Apr 2020 00:51 IST

ఐఐటీ-హైదరాబాద్‌ ప్రకటన

నెలకు రూ.50 వేలు

వైద్య, బయో మెడికల్‌ రంగాలకు ఉపయోగపడే వినూత్న పరికరాల డిజైన్‌, సేవల కోసం ఒక ఫెలోషిప్‌ లభిస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన హెల్త్‌కేర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను విద్యార్థులకు అందిస్తోంది. సంబంధిత ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఏడాది వ్యవధి ఉన్న ప్రోగ్రామ్‌ ఇది. యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌కు సంబంధించి శిక్షణ, ఇంక్యుబేషన్‌ దీనిలో భాగంగా ఉంటాయి.

సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ) ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ అయిదో బ్యాచ్‌కు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇదో ఫుల్‌ పెయిడ్‌ ఫెలోషిప్‌. సీఎఫ్‌హెచ్‌ఈని 2015లో ఐఐటీ-హైదరాబాద్‌లో హెల్త్‌కేర్‌కు సంబంధించిన సమస్యలకు తగిన పరిష్కారాలను కనుక్కోవాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. ఐఐటీ బాంబే పూర్వవిద్యార్థులు ఇద్దరు సీఎఫ్‌హెచ్‌ఈని స్పాన్సర్‌ చేశారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన నూతన ఆవిష్కరణలను తీసుకురావడం, తద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా పరిష్కారాలను సూచించడం సంస్థ ఉద్దేశం. ఇందులో భాగంగానే ఈ సీఎఫ్‌హెచ్‌ఈ- ఐఐటీహెచ్‌ ఫెలోషిప్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ను అందిస్తున్నారు. ఇంజినీర్లు, క్లినిషియన్స్‌, ఆంత్రప్రెన్యూర్స్‌, బిజినెస్‌ కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశం. తద్వారా వైద్య, బయోమెడికల్‌ డివైజ్‌లు, సేవా రంగాల్లో డిజైనింగ్‌, సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇది ఫుల్‌టైమ్‌ ఇన్‌ రెసిడెన్స్‌ ఫెలోషిప్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌. కాలవ్యవధి ఏడాది. బీటెక్‌/ బీఈ లేదా ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ లేదా బీ-డిజైన్‌ అంతకు మించిన విద్యార్హతలు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్ఛు ఏడాదికి 20 ఫెలోషిప్‌లను మాత్రమే అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.50,000 చెల్లిస్తారు. ఎంపికైన వారు ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో క్లినికల్‌ ఇమర్షన్‌కు సంబంధించి శిక్షణ పొందుతారు. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్లు బయోడిజైన్‌ ప్రాసెస్‌ను బోధిస్తారు. దీంతోపాటు మెంటర్లు, పరిశ్రమ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది.

మూడు దశల్లో ఎంపిక

అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటగా ఆన్‌లైన్‌ పరీక్షలో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, స్కిల్స్‌, ఆంత్రప్రెన్యూరల్‌ ఓరియెంటేషన్‌ ఆఫ్‌ ద కాండిడేట్స్‌ అంశాలను పరీక్షిస్తారు. రెండో దశలో హ్యాకథాన్‌ నిర్వహిస్తారు. ఈ రెండింట్లోనూ అర్హత సాధించినవారికి ఐఐటీహెచ్‌లో జరిగే తుది ఎంపికకు ఆహ్వానిస్తారు. ఇది మూడు రోజులపాటు సాగుతుంది. ఇక్కడ అభ్యర్థులకు మాక్‌ డ్రిల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విశ్లేషణ, సమస్యా సాధన, ఐడియేషన్‌, మార్కెట్‌ అనాలిసిస్‌, కాన్సెప్ట్‌ ప్రూఫ్‌ అంశాలను పరిశీలిస్తారు. ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో నచ్చిన స్టార్టప్స్‌కు సొంత సంస్థలను రూపొందించుకునే విధంగా ఐఐటీహెచ్‌ ఇంక్యుబేషన్‌ అవకాశాన్ని కల్పిస్తుంది.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://cfhe.iith.ac.in/index.html

దరఖాస్తుకు చివరితేదీ: మే 30, 2020.

ప్రిలిమినరీ రౌండ్‌: జూన్‌ 15, 2020.

హ్యాకథాన్‌: జూన్‌ 22, 2020

తుది ఎంపిక: జూన్‌ 29 నుంచి జులై 1 వరకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని