ఏ ఎలక్టివ్‌ మెరుగు?

మా అబ్బాయి బీబీఏ చదువుతున్నాడు. ఎంబీఏలో ఏ గ్రూపు తీసుకుంటే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది?

Published : 20 Jan 2022 11:59 IST

మా అబ్బాయి బీబీఏ చదువుతున్నాడు. ఎంబీఏలో ఏ గ్రూపు తీసుకుంటే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది?  - రవీంద్రనాథ్‌ చౌదరి
ప్రస్తుతం బీబీఏలో మీ అబ్బాయి వివిధ సబ్జెక్టులను చదువుతూ ఉంటాడు. ఈ పాటికి తనకు కొన్ని సబ్జెక్టులపై ఆసక్తి ఏర్పడివుంటుంది. తనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులతో ఎంబీఏ కూడా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉదాహరణకు- మీ అబ్బాయికి బీబీఏ లో మార్కెటింగ్‌ ఇష్టమైతే ఎంబీఏలోనూ మార్కెటింగ్‌ ఎలక్టివ్‌ తీసుకుంటే, ఇంటర్వ్యూల్లో బాగా సమాధానాలు చెప్పి మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఎంబీఏలో ఏ గ్రూప్‌ తీసుకున్నా ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. ఎంబీఏ కోర్సు, ఇతర పీజీ కోర్సుల లాంటిది కాదు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగం పొందాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, టీం లో పనిచేయగల నైపుణ్యాలు, సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు చాలా అవసరం. అవకాశం ఉంటే మీ అబ్బాయి బీబీఏ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఏదైనా ఉద్యోగం చేసి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ నుంచి ఎంబీఏ చేస్తే మెరుగైన వేతనంతో మంచి ఉద్యోగాన్ని పొందే వీలుంటుంది. ఎంబీఏను దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదవడం మంచిది. ఎందుకంటే... ఎంబీఏ కోర్సుకు అవసరమైన నైపుణ్యాలను సంపూర్ణంగా దూరవిద్య ద్వారా నేర్చుకోవడం సాధ్యం కాదు. 
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని