అంచనాలు... అందుకోవాలా?
అంచనాలు... విద్యార్థుల జీవితంలో ఇవి భాగం. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, బంధుమిత్రుల అంచనాలు అందుకోవడం కోసం మనం చాలా కష్టపడుతుంటాం. ఇవి మన స్థాయికి మించినవి అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు వీటిని అందుకోవాలా? అక్కర్లేదా? అసలు ఈ అంచనాలను ఎలా ఎదుర్కోవాలి?
* అన్నింటికంటే ముందు... మనం ఇప్పుడున్న స్థితి బాగానే ఉందనే ఆత్మస్థైర్యంతో ఉండాలి. నిరంతరం అసంతృప్తిలో కూరుకుపోవడం మంచిది కాదు. అది మన ఎదుగుదలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
* సాధారణ విద్యార్థుల విషయమే మాట్లాడుకుంటే... చుట్టూ ఉన్నవారి అంచనాలకు, వారి శక్తిసామర్థ్యాలకు మధ్య ఎంతోకొంత వ్యత్యాసం అనేది ఉండకమానదు. టాపర్స్ తప్పిస్తే ఇది అందరి విషయంలోనూ జరిగేదే. అందువల్ల కంగారు, ఒత్తిడి అనవసరం. వాటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి వీలైనంతగా ప్రయత్నించాలి అంతే.
* తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతిమంగా కోరుకునేది మన మంచినే. వారికంటే ఉన్నతంగా మనం ఉండాలనే భావిస్తారు. వారి ఆలోచనాధోరణి నుంచే అంచనాలు సృష్టించుకుంటారు. అయితే అది మన ఆశలు, ఆశయాలకు భిన్నంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం.
* కూర్చుని మాట్లాడుకుంటే యుద్ధాలు సైతం ఆగుతాయి అంటారు. అటువంటిది మన కుటుంబంలో పరిస్థితులు ఎంత? వారి అంచనాలకు భిన్నంగా మనం ఉన్నప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం తలెత్తడం సహజం. కానీ మనం ఏం కావాలి అనుకుంటున్నాం, ఎలా చేయాలి అనుకుంటున్నాం అనేది చెప్పే విధంగా సావధానంగా చెబితే వినేందుకు ఎదుటివారు సిద్ధపడతారు. ఇందుకోసం మన కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టిపెట్టడం అవసరం.
* అదే విధంగా మనపై మనకున్న అంచనాలు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. అవి వాస్తవానికి వీలైనంత దగ్గరగా ఉండాలి. ఇది గుర్తించేందుకు కొంత ప్రయత్నం, శ్రమ అవసరం. మనకు అంతిమంగా సంతోషాన్ని కలిగించేవి ఇవే. అందుకే వాటికి కొంత సమయం కేటాయించడం అవసరం.
* కొన్నిసార్లు మనం ఏం చేసినా ఎదుటివారు సంతోషించకపోవచ్చు. అటువంటప్పుడు ఆ విషయాన్ని వదిలేసి... మిగతా చోట్ల మనం వారితో ఏ విధంగా సంతోషంగా ఉండగలమో ఆలోచించాలి. ఏదో ఒక విషయంలో మనతో ఏకీభవిస్తారు కదా!
చివరిగా.. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న అంచనాలే మన లక్ష్యాలుగా మారొచ్చు. వాటిని అందుకోవడం మనకు ఆనందాన్ని కలిగించవచ్చు! అందువల్ల వాటిని పూర్తిగా ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన పనిలేదు. హ్యాండిల్ చేయడం సాధన చేస్తే చాలు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
MLC Kavitha: 8 గంటలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..