Learning: సొంతంగా నేర్చుకునేటప్పుడు...
జీవితంలోనూ, ఉద్యోగంలోనూ మనకు అవసరమయ్యే నైపుణ్యాలు, విషయాలన్నీ కాలేజీలోనే నేర్పించరు. కొన్ని మనం సొంతంగా సాధన చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాటిని సరిగ్గా నేర్చుకోలేకపోతే చాలా నష్టపోతాం. అందుకే దేన్నయినా సరే సొంతంగా నేర్చుకునేటప్పుడు (సెల్ఫ్ లెర్నింగ్) కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.
ఎంపిక
నేర్చుకోవాల్సిన విషయానికి సంబంధించిన మెటీరియల్, రిసోర్స్‌లను పక్కాగా, నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఎంచుకోవాలి, వాటినే అనుసరించాలి. కనిపించినదల్లా చదివితే ఏదీ పూర్తిగా రాదు. అలాగే ఏది పడితే అది చదివితే ఆ విషయం మనకు పనికిరావొచ్చు, రాకపోవచ్చు, అందులో తప్పులూ ఉండవచ్చు. అందువల్ల నాణ్యమైన మెటీరియల్ ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలి.
లక్ష్యాలు
నేర్చుకునే ప్రక్రియలో వీలైనంత చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా మొత్తం పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతాం. లక్ష్యసాధన ఇచ్చే ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా నేర్చుకోగలుగుతాం. లక్ష్యం లేని ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వదు. అందుకే ఏదో గాల్లో చదివేయకుండా ఒక టార్గెట్ అంటూ నిర్దేశించుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి.
ఆసక్తి
దేన్నయినా అభ్యసించేందుకు కుతూహలం తొలిమెట్టు. నేర్చుకోవడానికి చూపించే తపన మనల్ని పూర్తిగా ప్రేరేపిస్తుంది. అందుకే ఆ అంశం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మొత్తంగా ఆ విద్య ఒంటబట్టే వరకూ దాన్ని కొనసాగించగలగాలి. మధ్యలో విసుగ్గా అనిపించినా, వల్లకాదు అనిపించినా... వదిలేయకుండా చివరి వరకూ నేర్చుకునేలా మనకు మనమే ప్రేరణ పొందాలి.
వినియోగం
మనం దేన్నయినా ఎంత వరకూ నేర్చుకున్నామో తెలుసుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు మీరు టాబ్లూ సాఫ్ట్‌వేర్ గురించే నేర్చుకుంటున్నారు అనుకుందాం.. కొంత వరకూ వచ్చాక దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తేనే మీకు ఏం తెలుసు, ఎంతవరకూ తెలుసనే విషయాన్ని అంచనా వేయొచ్చు. ఎక్కడ వెనుకబడ్డారో తెలుసుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఏ నైపుణ్యానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ప్రణాళిక
‘సమయం ఉన్నప్పుడు చేద్దాంలే’ అన్న భావన వాయిదాకు దారితీస్తుంది. స్థిరమైన ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే నేర్చుకునే ప్రక్రియ ప్రభావవంతంగా మారుతుంది. పక్కాగా టైంటేబుల్ వేసుకోవడం, దాన్ని అంతే కచ్చితంగా అమలు చేయడం సెల్ఫ్ లెర్నింగ్‌లో చాలా కీలకం.
బృందం
మీలాగే నేర్చుకోవాలి అనుకుంటున్న వారితో బృందంగా ఏర్పడవచ్చు. అందరూ కలిసి సాధన చేయడం ద్వారా ఒకరి పొరపాట్ల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్ లెర్నింగ్‌లో అయితే కమ్యూనిటీలుగా ఏర్పడి ఒకరికి ఒకరు సహాయపడటం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS High court: జూనియర్ లెక్చరర్ పరీక్షపై టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు