నోటీస్‌బోర్డు

ఇండియన్‌ ఆర్మీ..షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 50వ కోర్సు(అక్టోబర్‌ 2021)

Updated : 21 Jun 2021 05:15 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీ- 55 ఖాళీలు

ఇండియన్‌ ఆర్మీ..షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 50వ కోర్సు(అక్టోబర్‌ 2021) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్హులు.

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 55 పోస్టులు - ఖాళీలు: ఎన్‌సీసీ మెన్‌ - 50, ఎన్‌సీసీ విమెన్‌ - 05. అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.  వయసు:  01.07.2021 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక:  షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 2021, జులై 15. వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


ఎన్‌సీపీఓఆర్‌లో 85 పోస్టులు

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌(ఎన్‌సీపీఓఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 85 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, జులై 15. వెబ్‌సైట్‌: https://ncpor.res.in/


187 గ్రామ/ వార్డ్‌ వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ/ వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రామ/ వార్డ్‌ సచివాలయ వాలంటీర్లు

మొత్తం ఖాళీలు: 187 అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. స్థానిక గ్రామ/ వార్డ్‌ పరిధిలో నివసిస్తూ ఉండాలి. వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: https://apgv.apcfss.in/


సీఆర్‌పీఎఫ్‌లో 25 అసిస్టెంట్‌ కమాండెంట్లు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ కమాండెంట్‌ (సివిల్‌)

మొత్తం ఖాళీలు: 25 అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా . దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డీఐజీ, గ్రూప్‌ సెంటర్‌, సీఆర్‌పీఎఫ్‌, రాంపూర్‌, యూపీ - 244901. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, జూన్‌ 30. దరఖాస్తుకు చివరి తేది: 2021, జులై 29.

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/


సీ-డ్యాక్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ ఎలక్టాన్రిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 13 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌. వయసు: 37 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇతర టెస్ట్‌ల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2021, జూన్‌ 26. వెబ్‌సైట్‌: https://cdac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని