నోటీసు బోర్డు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Mar 2022 04:53 IST

ఉద్యోగాలు

ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్‌ ఎగ్జామ్‌ 2021

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మల్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌), హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌) స్టాఫ్‌ ఎగ్జామినేషన్‌ 2021
మొత్తం ఖాళీలు: 1) ఎంటీఎస్‌ - వెల్లడించాల్సి ఉంది. 2) హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌)-3603 అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. వయసు: 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పేపర్‌-1, పేపర్‌-2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30. వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

 


ఎన్‌టీపీసీలో 55 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌లు
మొత్తం ఖాళీలు: 55 విభాగాలు: కంబైన్డ్‌ సైకిల్‌ పవర్‌ ప్లాంట్‌-ఓఅండ్‌ఎం, ఆపరేషన్స్‌ -పవర్‌ ట్రేడింగ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌-పవర్‌ ట్రేడింగ్‌. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 25. దరఖాస్తులకు చివరితేది: 2022, ఏప్రిల్‌ 08.www.ntpc.co.in/en


ఐఐఎం, విశాఖపట్నంలో...

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు విభాగాలు: డిసిషన్‌ సైన్సెస్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, పబ్లిక్‌ పాలిసీ, స్ట్రాటజీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: www.iimv.ac.in/


 ఈఎంఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు
విభాగాలు: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీర్లు, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఇంజినీర్లు తదితరాలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 06.www.bemlindia.in/


ప్రవేశాలు

స్పా, భోపాల్‌లో పీజీ ప్రోగ్రాములు
భోపాల్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)2022-2023 విద్యాసంవత్సరానికి కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాములు: మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (కన్జర్వేషన్‌), మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ తదితరాలు. అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (బీఆర్క్‌/ బీప్లాన్‌/ బీఈ/ బీటెక్‌) ఉత్తీర్ణత. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18. వెబ్‌సైట్‌:http://spabhopal.ac.in/


వాక్‌ఇన్‌

సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐలో...
కరైకుడిలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎల‌్రక్టోకెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈసీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-08, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు-02. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేదీలు: 2022, ఏప్రిల్‌ 5-7. వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ, కరైకుడి. వెబ్‌సైట్‌: www.cecri.res.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని