నోటిఫికేషన్స్‌

ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Apr 2022 02:18 IST

ఉద్యోగాలు

ఐబీలో 150 ఏసీఐఓ పోస్టులు

ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్లు గ్రేడ్‌-2 (ఏసీఐఓ)

మొత్తం ఖాళీలు: 150 విభాగాలు-ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-56, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌- 94.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ 2020/ 2021/ 2022 స్కోర్‌ కార్డు ఉండాలి.

వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2020/ 2021/ 2022 మెరిట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 16.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 07.

వెబ్‌సైట్‌: www.mha.gov.in/


వెస్టర్న్‌ కమాండ్‌లో..

ఇండియన్‌ ఆర్మీకి చెందిన వెస్టర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 70 పోస్టులు-ఖాళీలు: వార్డ్‌ సహాయక్‌-51, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌-19.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు సర్టిఫికెట్‌, అనుభవం ఉండాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఫిజికల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

చిరునామా: కమాండెంట్‌, కమాండ్‌ హాస్పిటల్‌ (వెస్టర్న్‌ కమాండ్‌), చండీమందిర్‌, పంచకుల (హరియాణ) 134107.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


ఐపీఆర్‌లో ఎంటీఎస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన గాంధీనగర్‌ (గుజరాత్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌ (ఐపీఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)

మొత్తం ఖాళీలు: 31

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: www.ipr.res.in/


ప్రవేశాలు

ఐఐఎస్సీలో బీఎస్సీ (రిసెర్చ్‌) ప్రోగ్రాం

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: నాలుగు సంవత్సరాలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. 2022లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై)/ జేఈఈ మెయిన్‌ 2022/ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022/ నీట్‌ (యూజీ) 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31.

9వెబ్‌సైట్‌: https://iisc. ac.in/


ఐఐఎం ఇండోర్‌లో...

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 2022-2027 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ అసెస్‌మెంట్‌/ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 21. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష తేది: 2022, జులై 02.

వెబ్‌సైట్‌: www.iimidr.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని