డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌లు

స్వతంత్ర భారతదేశంలోనే మొదటి మల్టీపర్పస్‌ రివర్‌ వ్యాలీ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధిచెందింది దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ).

Updated : 24 May 2023 02:23 IST

స్వతంత్ర భారతదేశంలోనే మొదటి మల్టీపర్పస్‌ రివర్‌ వ్యాలీ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధిచెందింది దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ). ఇది కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ థర్మల్‌, హైడల్‌ పవర్‌ స్టేషన్లను నిర్వహిస్త్తోంది. ఈ సంస్థ తాజాగా పశ్చిమ బెంగాల్‌/ ఝూర్ఖండ్‌ రాష్ట్రాల్లోని డీవీసీ ప్లాంట్లు/ స్టేషన్లలో జూనియర్‌ ఇంజినీర్‌ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సి అండ్‌ ఐ, సివిల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగాల్లో 40 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లామా (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ) 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎంఈ.. లాంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలు ఉన్నవారూ, డిస్టెన్స్‌ విధానంలో చదివినవాళ్లూ దరఖాస్తు చేయడానికి అనర్హులు.

జూనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)-10, జేఈ (ఎలక్ట్రికల్‌)-10, జేఈ (సిఅండ్‌ఐ) -10, జేఈ (సివిల్‌)-05, జేఈ (కమ్యూనికేషన్‌)-05 పోస్టులున్నాయి. మొత్తం పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 17, ఓబీసీలకు 9, ఎస్సీలకు 7, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్‌లకు 3 కేటాయించారు.

అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, డీవీసీ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజులేదు. 

ఎంపిక

రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1 జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఒకాబ్యులరీ, వెర్బల్‌ కాంప్రహెన్షన్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియెన్సీ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ఉంటాయి.

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో భాగంగా సమస్యలను వేగంగా పరిష్కరించడంలో అభ్యర్థి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. పర్యావరణం, తన చుట్టూ ఉండే పరిస్థితుల పట్ల అభ్యర్థికి ఉండే అవగాహనను తెలుసుకునేలా ప్రశ్నలు ఇస్తారు. ఇంకా బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలూ, అనువర్తనాలూ ఉంటాయి.

పార్ట్‌-2లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీంట్లో భాగంగా ఇంజినీరింగ్‌ డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సీఅండ్‌ఐ/ సివిల్‌/ కమ్యూనికేషన్‌) సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, సంక్షిప్తంగా సిలబస్‌, నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుందా లేదా అనే వివరాలను డీవీసీ వెబ్‌సైట్‌లో త్వరలోనే తెలియజేస్తారు.
ఈ పరీక్షలో పాసవ్వాలంటే.. జనరల్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌)/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రతి పార్టులోనూ 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సంపాదించాలి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టు తయారుచేసి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. దీంట్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికచేస్తారు. వీరికి ఏడాది ప్రొబేెషన్‌ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసినవారిని రెగ్యులరైజ్‌ చేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 26.05.2023

వెబ్‌సైట్‌: http://www.dvc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని