విదేశీ విద్యకు..ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి కెరియర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాలనే అభిలాష ఎంతోమందికి ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా అందరు విద్యార్థులూ దాన్ని నిజం చేసుకోలేరు. ఇలాంటివారి కలలను సాకారం చేస్తోంది ‘నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌’

Published : 24 Feb 2022 05:23 IST

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి కెరియర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాలనే అభిలాష ఎంతోమందికి ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా అందరు విద్యార్థులూ దాన్ని నిజం చేసుకోలేరు. ఇలాంటివారి కలలను సాకారం చేస్తోంది ‘నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌’

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ‘నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌’ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. ఎస్‌సీ, ఎస్‌టీ, వ్యవసాయ కూలీ కుటుంబాల విద్యార్థులు, సంప్రదాయ కళాకారులు అర్హులు.

అర్హతలు: విదేశాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థులు డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ కోర్సు చేసిన కాలేజీ వివరాలను దరఖాస్తులో రాయాలి. పీహెచ్‌డీకి దరఖాస్తు చేసే విద్యార్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. పీజీ చదివిన విద్యాసంస్థ వివరాలను దరఖాస్తులో తెలియజేయాలి. డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. వయసు: 35 ఏళ్లల్లోపు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలు మించకూడదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి.

ఎన్ని స్కాలర్‌షిప్‌లు: ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో షెడ్యూల్డ్‌ కులాలకు-115, తెగలకు- 6, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు -4 కేటాయించారు. మాస్టర్స్‌ డిగ్రీ చేసేవారికి మూడేళ్లకు, పీహెచ్‌డీ చేసేవారికి నాలుగేళ్ల కాలానికి స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తారు. ట్యూషన్‌ ఫీజు, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌, అత్యవసర ఖర్చులు, వీసా ఫీజు, ఎక్విప్‌మెంట్‌ అలవెన్స్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం.. మొదలైన ఖర్చుల నిమిత్తం స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందుతుంది.


దరఖాస్తు స్థాయిలో అవసరమయ్యే డాక్యుమెంట్లు: టెన్త్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌, కులధ్రువీకరణ పత్రం, ఫొటో, స్కాన్డ్‌ సిగ్నేచర్‌, కరెంట్‌/ పర్మనెంట్‌ అడ్రస్‌ ప్రూఫ్‌, డిగ్రీ/ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, అర్హత పరీక్షకు సంబంధించి ప్రతి సెమిస్టర్‌లో మార్క్‌షీట్స్‌, ప్రూఫ్‌ ఆఫ్‌ సీజీపీఏ/ ఎస్‌జీపీఏ, ఫారిన్‌ యూనివర్సిటీ ఆఫర్‌ లెటర్‌, కుటుంబ ఆదాయ ధ్రువపత్రం, ఇన్‌కంటాక్స్‌ రిటర్న్‌ (అభ్యర్థి ఆదాయపు పన్ను కడుతున్నట్లయితే), నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (అభ్యర్థి ఉద్యోగి అయితే).

విదేశీ వర్సిటీ వివరాలు: ప్రవేశం పొందిన విదేశీ యూనివర్సిటీ/ విద్యాసంస్థ వివరాలను దరఖాస్తులో తెలియజేయాలి. అన్‌కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ వర్సిటీల్లో ప్రవేశం లభిస్తే వాటిలో ఒకదాన్ని ఎంచుకుని ఆ వివరాలను తెలియజేయాలి. అభ్యర్థి ఇప్పటికే వీసా పొంది ఉంటే ఆ వివరాలను దరఖాస్తులో తెలియజేయాలి. లేదా వీసాకు దరఖాస్తు చేసినట్లయితే ఆ వివరాలను రాయాలి. పోర్టల్‌లో ఉన్న మార్గదర్శకాలను పాటిస్తూ ఈ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోర్టల్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు నింపే క్రమంలో ఈమెయిల్‌, మొబైల్‌ నంబర్‌లను సరిగా రాయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022

పోర్టల్‌:www.nosmsje.gov.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని