కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో నంబర్‌ 1 ర్యాంక్‌ సాధించిన భారత యువ షట్లర్‌ ఎవరు? (ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణి ఈమె. తొలి క్రీడాకారిణి తస్నిమ్‌)...

Published : 17 Nov 2022 00:31 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో నంబర్‌ 1 ర్యాంక్‌ సాధించిన భారత యువ షట్లర్‌ ఎవరు? (ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణి ఈమె. తొలి క్రీడాకారిణి తస్నిమ్‌)

జ: అనుపమ ఉపాధ్యాయ

రెండేళ్లపాటు విజృంభించిన కరోనా మహమ్మారితో భారత మానవాభివృద్ధి ఎన్నేళ్లు వెనక్కి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ)నివేదిక వెల్లడించింది?

జ: అయిదేళ్లు

ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు వైర్‌లెస్‌ కరెంట్‌పై ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు? (30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగించి వైర్‌లెస్‌గా విద్యుత్‌ను ప్రసరింపజేశారు. 400 మిల్లీవాట్ల విద్యుత్‌ను సురక్షితంగా ప్రసరింపజేసి ఎల్‌ఈడీ లైట్‌ను వెలిగేలా చేశారు.)

జ: దక్షిణ కొరియా

దివంగత బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ హయాంలో బ్రిటన్‌ ప్రధానమంత్రులుగా ఎంతమంది వ్యవహరించారు?

జ: 15 మంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని