కరెంట్‌ అఫైర్స్‌

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? (ఈయన బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కార్యదర్శిగా ఉన్నారు.

Published : 12 Mar 2024 00:34 IST

మాదిరి ప్రశ్నలు

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? (ఈయన బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కార్యదర్శిగా ఉన్నారు. ఇండొనేసియాలోని బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈయనను ఎన్నుకున్నారు. ఈ పదవికి ఎన్నికకావడం ఇది మూడోసారి. ఏసీసీ అధ్యక్షుడిగా ఈయన మరో ఏడాది పాటు కొనసాగనున్నారు.) 

జ: జై షా


అయిదు వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే నాలుగు అణు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాన్ని ఇటీవల ఏ దేశం చేపట్టింది? (దేశ తూర్పు తీర పట్టణం సిరిక్‌ సమీపంలో వీటి నిర్మాణం మొదలైందని ఈ దేశ అణు విభాగ అధిపతి మహ్మద్‌ ఎస్లామి వెల్లడించారు. సుమారు 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.64 లక్షల కోట్లు) వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రష్యా సహకారంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల అణు ప్లాంటు ఈ దేశంలో ఇప్పటికే పనిచేస్తోంది.)

జ: ఇరాన్‌


‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని ఇటీవల ఎవరు ఇచ్చారు? (వివాహాలను ఘనంగా జరిపించేందుకు విదేశాలకు వెళ్లే వారంతా వాటిని భారత్‌లోనే చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఈ నినాదాన్ని ఇస్తున్నట్లు వీరు పేర్కొన్నారు.)

జ: ప్రధాని నరేంద్ర మోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని