కర్ణాటకలో అధికంగా ‘పిచ్చివాడి బంగారం!’

భూ అంతర్భాగంలో రసాయన సమ్మేళనాల ఫలితంగా ఏర్పడే లోహాలే ఖనిజాలు. ఒక దేశ భౌతిక సంపదలో ఖనిజ వనరులు ముఖ్యమైనవి. పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక వృద్ధి, ఉపాధి  కల్పనకు అవి చోదకశక్తిగా పని చేస్తాయి.

Published : 12 Mar 2024 00:51 IST

టీఆర్‌టీ - 2024 జాగ్రఫీ

భూ అంతర్భాగంలో రసాయన సమ్మేళనాల ఫలితంగా ఏర్పడే లోహాలే ఖనిజాలు. ఒక దేశ భౌతిక సంపదలో ఖనిజ వనరులు ముఖ్యమైనవి. పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక వృద్ధి, ఉపాధి  కల్పనకు అవి చోదకశక్తిగా పని చేస్తాయి. దేశంలో ఖనిజాల లభ్యత తీరుతెన్నులు, నాణ్యత ఆధారంగా ధాతువుల్లోని రకాలు, అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు, ప్రధాన గనులున్న ప్రాంతాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఖనిజాల పరిశోధన, ఉత్పత్తికి  సంబంధించి ఏర్పాటైన సంస్థలు, వాటి కేంద్రస్థానాల గురించి తెలుసుకోవాలి.

ఖనిజ వనరులు

1. ‘ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌’ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి   2) నాగ్‌పుర్‌  
3) చెన్నై         4) దిల్లీ

2. ‘నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  (ఎన్‌ఎండీసీ)’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) చెన్నై          2) కోల్‌కతా  
3) హైదరాబాద్‌   4) దిల్లీ

3. కిందివాటిలో లోహ ఖనిజం కానిది?

1) వెండి            2) క్రోమైట్‌    
3) అల్యూమినియం   4) వజ్రాలు

4. కిందివాటిలో ‘పిచ్చివాడి బంగారం’ అని దేన్ని పిలుస్తారు?

1) బొగ్గు   2) మట్టి   3) రాగి  4) ఇనుము

5. కిందివాటిలో అలోహ ఖనిజం కానిది?

1) సున్నపురాయి 2) ముగ్గురాయి  
3) టంగ్‌స్టన్‌   4) గ్రాఫైట్‌

6. ‘పిచ్‌ బ్లండ్‌’ అనే ముడి ఖనిజం ఏ ఖనిజానికి సంబంధించింది?

1) థోరియం     2) యురేనియం  
3) ప్లూటోనియం  4) జిర్కోనియం

7. కిందివాటిలో అత్యంత నాణ్యమైన బొగ్గురకం ఏది?

1) పీట్‌        2) బిట్యుమినస్‌  
3) ఆంథ్రసైట్‌   4) లిగ్నైట్‌

8. ఆంథ్రసైట్‌ అనే బొగ్గు రకంలోని కర్బన శాతం ఎంత?

1) 95%  2) 85%   3) 75%  4) 65%

9. కిందివాటిలో హార్డ్‌ కోల్‌ అని దేన్ని పిలుస్తారు?

1) బిట్యుమినస్‌   2) లిగ్నైట్‌  
3) ఆంథ్రసైట్‌     4) పీట్‌

10. కిందివాటిలో అతితక్కువ నాణ్యత ఉన్న బొగ్గు రకం ఏది?

1) ఆంథ్రసైట్‌   2) బిట్యుమినస్‌  
3) పీట్‌         4) లిగ్నైట్‌

11. కింది ఏ బొగ్గు రకంలో 90% నీరు ఉంటుంది?

1) పీట్‌        2) లిగ్నైట్‌  
3) ఆంథ్రసైట్‌   4) బిట్యుమినస్‌

12. భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఏది?

1) కోర్బా       2) తల్బేరు  
3) రాణిగంజ్‌   4) ఝరియా

13. కుద్రేముఖ్‌ ఇనుప గని ఏ రాష్ట్రంలో ఉంది?

1) తమిళనాడు   2) కర్ణాటక  
3) ఆంధ్రప్రదేశ్‌   4) కేరళ

14. ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కోల్‌కతా   2) రాంచి  
3) ధన్‌బాద్‌   4) ఏదీకాదు

15. కిందివాటిలో దేన్ని ఐరన్‌ ఆక్సైడ్‌ అని కూడా పిలుస్తారు?

1) హెమటైట్‌  2) లియోనైట్‌  
3) సిడరైట్‌   4) మాగ్నటైట్‌

16. మాగ్నటైట్‌ అనే ఖనిజాన్ని ఏమని పిలుస్తారు?

1) ఐరన్‌ ఆక్సైడ్‌   2) బ్లాక్‌ ఓర్‌  
3) ఐరన్‌ కార్బొనేట్‌  4) హైడ్రేటెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్‌

17. మాగ్నటైట్‌ అనే ఇనుప ధాతువులో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది?

1) 72     2) 70     3) 68    4) 65

18. కిందివాటిలో ‘లాండ్‌స్టోన్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) హెమటైట్‌   2) లిగ్నైట్‌  
3) మాగ్నటైట్‌   4) సిడరైట్‌

19. హెమటైట్‌లో ఇనుము ఎంత శాతం ఉంటుంది?

1) 72     2) 70    3) 68     4) 65

20. కిందివాటిలో ‘ఇండస్ట్రియల్‌ ఐరన్‌ ఓర్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) మాగ్నటైట్‌    2) హెమటైట్‌    
3) లియోనైట్‌     4) సిడరైట్‌

21. కిందివాటిలో హైడ్రేటెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్‌ అని దేన్ని పిలుస్తారు?

1) హెమటైట్‌    2) లియోనైట్‌  
3) మాగ్నటైట్‌   4) సిడరైట్‌

22. లియోనైట్‌లో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది?

1) 60     2) 70     3) 80    4) 65

23. కిందివాటిలో కార్బొనేట్‌ ఐరన్‌ అంటే?

1) లియోనైట్‌   2) సిడరైట్‌  
3) హెమటైట్‌   4) మాగ్నటైట్‌

24. కిందివాటిలో అలోహ ఖనిజం?

1) రాగి             2) వెండి  
3) సున్నపురాయి  )4 అల్యూమినియం

25. ‘ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌’ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1943  2) 1958  3) 1948  4) 1962

26. కిందివాటిలో మృదువైన బొగ్గుగా దేన్ని పిలుస్తారు?

1) ఆంథ్రసైట్‌     2) బిట్యుమినస్‌  
3) లిగ్నైట్‌       4) పీట్‌

27. కిందివాటిలో ‘బ్రౌన్‌ కోల్‌’ అంటే?

1) బిట్యుమినస్‌   2) లిగ్నైట్‌  
3) ఆంథ్రసైట్‌     4) పీట్‌

28. లిగ్నైట్‌ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఏ రాష్ట్రంలో దొరుకుతాయి?

1) మహారాష్ట్ర     2) కేరళ  
3) తమిళనాడు    4) ఆంధ్రప్రదేశ్‌

29. కోర్బా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఛత్తీస్‌గఢ్‌     2) మహారాష్ట్ర  
3) ఝార్ఖండ్‌     4) తమిళనాడు

30. భారతదేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏది?

1) ఝరియా   2) బొకారో  
3) రాణిగంజ్‌   4) కోర్బా

31. సింగ్రౌలి బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర   2) మధ్యప్రదేశ్‌  
3) పశ్చిమ బెంగాల్‌   4) మేఘాలయ

32. బొకారో బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) రాజస్థాన్‌  
3) ఝార్ఖండ్‌       4) ఒడిశా

33. దక్షిణ భారతదేశంలో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?

1) తమిళనాడు     2) కర్ణాటక  
3) కేరళ           4) ఆంధ్రప్రదేశ్‌

34. ఆసియాలోనే అతి పెద్ద యాంత్రీకరించిన ఇనుప ఖనిజ గని ఏది?

1) బైలదిల్లా     2) సింగ్‌భీమ్‌  
3) కుద్రేముఖ్‌   4) కోరాపూట్‌

35. రాజస్థాన్‌లోని జవార్‌ గనులు వేటికి ప్రసిద్ధి?

1) బంగారం   2) బాక్సైట్‌  
3) జింక్‌     4) వజ్రాలు

36. బాక్సైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?

1) కర్ణాటక     2) ఆంధ్రప్రదేశ్‌  
3) ఒడిశా      4) కేరళ

37. రుద్రసాగర్‌ చమురు గని ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక     2) తమిళనాడు  
3) మహారాష్ట్ర   4) అస్సాం

38. బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా   2) ఛత్తీస్‌గఢ్‌  
3) కర్ణాటక   4) మహారాష్ట్ర

39. అంకాళేశ్వర్‌ దేనికి ప్రసిద్ధి చెందింది?

1) చమురు నిక్షేపాలు   2) బొగ్గు  
3) ఇనుము            4) బంగారం

40. మధ్యప్రదేశ్‌లోని పన్నా దేనికి ప్రసిద్ధి?

1) డోలమైట్‌   2) వజ్రాలు  
3) ఇల్మానైట్‌   4) బాక్సైట్‌

41. ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

1) 1వ   2) 2వ    3) 3వ    4) 4వ

42. ‘జిన్‌ గుర్ధా’ బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) ఝార్ఖండ్‌    
3) కేరళ           4) కర్ణాటక

43. రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి?

1) సీసం   2) జిప్సం  
3) జింక్‌   4) రాగి

44. ‘నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1968   2) 1958  
3) 1948   4) 1978

45. క్రోమైట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?

1) ఒడిశా    2) ఛత్తీస్‌గఢ్‌  
3) కర్ణాటక   4) రాజస్థాన్‌

46. కిందివాటిలో మోనోజైట్‌ దేనికి సంబంధించింది?

1) యురేనియం   2) గాలియం  
3) టైటానియం   4) థోరియం

47. మన దేశంలో అతి పురాతన మాంగనీస్‌ గని ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఆంధ్రప్రదేశ్‌   2) కర్ణాటక  
3) మహారాష్ట్ర   4) ఒడిశా

48. ‘కోల్‌ ఇండియా లిమిటెడ్‌’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) చెన్నై        2) దిల్లీ  
3) కోల్‌కతా     4) ముంబయి

49. కిందివాటిలో అణు ఇంధన ఖనిజం కానిది?

1) యురేనియం   2) థోరియం  
3) జిర్కోనియం   4) క్రోమైట్‌  

50. మన దేశంలో నాణ్యమైన మైకా లభించే కోడెర్మా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర     2) కర్ణాటక  
3) ఝార్ఖండ్‌     4) కేరళ

51. భూగోళంపై ఉన్న భూపటలంలోని మూలకాల్లో ఆక్సిజన్‌ సరాసరి శాతం?

1) 46%   2) 57%   3) 41%   4) 37%

52. భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లో ఇనుము సరాసరి శాతం?

1) 6%    2) 10%    3) 11%   4) 5%

53. భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత?

1) 40%   2) 15%   3) 32%   4) 45%

54. భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో అల్యూమినియం సరాసరి శాతం ఎంత?

1) 1.4%  2) 1.8%  3) 1.2%  4) 2.9%

55. భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లోని పొటాషియం సరాసరి శాతం?

1) 2.6%  2) 4% 3) 2.9%  4) 27.7%

56. భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో సిలికాన్‌ సరాసరి శాతం ఎంత ఉంటుంది?

1) 2.7%    2) 15.1%  
3) 7.4%    4) 2.9%

సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-4; 5-3; 6-2; 7-3; 8-1; 9-3; 10-3; 11-1; 12-3; 13-2; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-2; 21-2; 22-1; 23-2; 24-3; 25-3; 26-2; 27-2; 28-3; 29-1; 30-1; 31-2; 32-3; 33-2; 34-1; 35-3; 36-3; 37-4; 38-2; 39-1; 40-2; 41-1; 42-1; 43-4; 44-2; 45-1; 46-4; 47-1; 48-3; 49-4; 50-3; 51-1; 52-4; 53-3; 54-1; 55-1; 56-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు