ఇన్‌స్టిట్యూట్‌ మారితే ఫీజు వెనక్కి..

ఒక విద్యాసంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థి.. ఏదైనా కారణాలతో మరో ఇన్‌స్టిట్యూట్‌కి మారాల్సి వస్తే, అతడు కట్టిన ఫీజు మొత్తాన్ని రిఫండ్‌ ఇవ్వాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Published : 14 Mar 2024 00:03 IST

క విద్యాసంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థి.. ఏదైనా కారణాలతో మరో ఇన్‌స్టిట్యూట్‌కి మారాల్సి వస్తే, అతడు కట్టిన ఫీజు మొత్తాన్ని రిఫండ్‌ ఇవ్వాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కట్టిన ఫీజు తిరిగివ్వని విధానం (నాన్‌ రిఫండ్‌) ద్వారా నష్టపోయిన అనేక మంది విద్యార్థుల ద్వారా వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారంగా యూజీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉన్నత విద్యలో విద్యార్థులకు నష్టదాయకం కాని విధానాలు ఉండాలని భావించింది.  దీనికి సంబంధించి విద్యాసంస్థలు పాటించాల్సిన విధివిధానాలపై ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. పాటించని వాటిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు కూడా అందులో రాశారు. ఈ గైడ్‌లైన్స్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, యూనివర్సిటీలు అందించే రిసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌ వారికి వర్తిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని