కరెంట్‌అఫైర్స్‌

ఐక్యరాజ్య సమితి (ఐరాస) 2024 వార్షిక బడ్జెట్‌కు భారత్‌ ఎంత మొత్తాన్ని విరాళంగా అందజేసింది? (సకాలంలో ఐరాస బడ్జెట్‌కు నిధులు అందించి గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన మనదేశం నిలిచింది.

Published : 14 Mar 2024 00:55 IST

మాదిరి ప్రశ్నలు

'

ఐక్యరాజ్య సమితి (ఐరాస) 2024 వార్షిక బడ్జెట్‌కు భారత్‌ ఎంత మొత్తాన్ని విరాళంగా అందజేసింది? (సకాలంలో ఐరాస బడ్జెట్‌కు నిధులు అందించి గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన మనదేశం నిలిచింది. 2024, జనవరి 31 నాటికి ఈ దేశాలు తమ విరాళం మొత్తాలను పూర్తిస్థాయిలో అందజేశాయని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌, అధికార ప్రతినిధి స్టీఫెన్‌ దుజరిక్‌ ప్రకటించారు.)

జ: సుమారు రూ.2730 కోట్లు (32.89 మిలియన్‌ డాలర్లు)


2022 నాటికి 40 వేల మెగావాట్ల రూఫ్‌ టాప్‌ సౌర విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? (ఈ క్రమంలోనే 2024-25 బడ్జెట్‌లో సౌర విద్యుత్తు కార్యక్రమాలకు కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్‌లో కేటాయించిన రూ.4757 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం అధికం. అంతేకాకుండా రూఫ్‌ టాప్‌ సౌర విద్యుత్తు ద్వారా కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.) 

జ: 2026


ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్‌ ఇటీవల ప్రారంభించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటి?

జ: తమిళగ వెట్రి కళగం (తమిళనాడు విజయ పార్టీ అని అర్థం)


ఏ దేశంలోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ను సందర్శించే పర్యాటకులు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్‌ 2024, ఫిబ్రవరి 2న ప్రారంభించింది?

జ: ఫ్రాన్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని