కరెంట్‌ అఫైర్స్‌

రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబయి జట్టు గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో 2024, మార్చి 14న జరిగిన ఫైనల్లో ఆ జట్టు 169 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది.

Published : 16 Mar 2024 04:08 IST

రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబయి జట్టు గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో 2024, మార్చి 14న జరిగిన ఫైనల్లో ఆ జట్టు 169 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. 90 ఏళ్ల రంజీ చరిత్రలో ముంబయికి ఇది 42వ టైటిల్‌. మొత్తం 48 సార్లు ఈ జట్టు ఫైనల్‌ చేరింది. ముంబయి జట్టుకు చెందిన ముషీర్‌ఖాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు, తనుష్‌ కొటియాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు లభించాయి.


మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ 2024, మార్చి 14న వీరి పేర్లకు ఆమోదం తెలిపింది.

ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ మార్చి 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీకాలం ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీచేసింది.


క్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) 2022లో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో మొత్తం 193 దేశాలు ఉన్నాయి. 2021 సూచీలో 191 దేశాలకుగాను మన దేశం 135వ ర్యాంకులో ఉంది.


భారత నౌకాదళం అమ్ములపొదిలోకి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధనౌకలు 2024, మార్చి 13న చేరాయి. వీటికి ఐఎన్‌ఎస్‌ అగ్రే, ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అని పేర్లు పెట్టారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు, 25 నాట్స్‌ గరిష్ఠవేగంతో ప్రయాణిస్తాయి.


మరింత సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని