నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.

Published : 17 Mar 2024 03:11 IST

అడ్మిషన్స్‌

ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.

వివరాలు: మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024
గ్రూప్‌: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.
మొత్తం సీట్లు: 2,600. బాలుర సీట్లు: 1,300 బాలికల సీట్లు: 1,300
విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి మార్చి 2024 ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 31.08.2024 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ప్రవేశపరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.250. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 13-04-2024.

వెబ్‌సైట్‌: https://mjpapbewries.apsefss.in/


గవర్నమెంట్‌ జాబ్స్‌

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 100
విభాగాలు: అకౌంట్స్‌, యాక్చూరియల్‌, ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ (ఐటీ), మెడికల్‌ ఆఫీసర్‌, లీగల్‌.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌), బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,925- రూ.96,765.
వయో పరిమితి: 31-12-2023 నాటికి 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠంగా అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, మెయిన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.
దరఖాస్తు చివరి తేది: 12-04-2024

వెబ్‌సైట్‌: https://orientalinsurance.org.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు