కరెంట్‌ అఫైర్స్‌

2024, జనవరిలో మలేసియాలోని జోహర్‌ రాష్ట్రానికి చెందిన సుల్తాన్‌ ఇబ్రహీం మలేసియా  దేశానికి ఎన్నో రాజుగా నియమితులయ్యారు?

Updated : 18 Mar 2024 05:43 IST

మాదిరి ప్రశ్నలు 

2024, జనవరిలో మలేసియాలోని జోహర్‌ రాష్ట్రానికి చెందిన సుల్తాన్‌ ఇబ్రహీం మలేసియా  దేశానికి ఎన్నో రాజుగా నియమితులయ్యారు?

జ: 17వ రాజు 

ఎకనామిక్‌ కమ్యూనిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్రికన్‌ స్టేట్స్‌ (ఈసీఓడబ్ల్యూఏఎస్‌) నుంచి 2024, జనవరిలో వైదొలగిన మూడు దేశాలు ఏవి?  

 జ: బుర్కినాఫాసో, నైజర్‌, మాలి

భూటాన్‌కు చెందిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు, ప్రస్తుత ప్రధానమంత్రి షెరింగ్‌ టోబ్గే ఇటీవల ఎన్నోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు?

జ: రెండోసారి

అజాలీ అసోమానీ ఏ తూర్పు ఆఫ్రికా దేశానికి   నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?  

 జ: కొమొరోస్‌

దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా తొలిసారిగా ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? 

జ: సౌదీ అరేబియా

19వ నామ్‌ (నాన్‌-అలైన్డ్‌ మూవ్‌మెంట్‌) సదస్సును 2024, జనవరిలో ఎక్కడ నిర్వహించారు?

జ: ఉగాండా

2024, జనవరిలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఏ దేశంలో పర్యటించారు? 

 జ: యూకే

 2024, జనవరిలో ఏ దేశం మంచు చిరుతను తన జాతీయ చిహ్నంగా ప్రకటించింది?

 జ: కిర్గిస్థాన్‌


టాటా సన్స్‌ కంపెనీ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటాను 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహరావు స్మారక పురస్కారం వరించింది. ఆయన చేసిన పలు దాతృత్వ సేవలకుగానూ ఈ అవార్డును 15 మార్చి 2024న ముంబయిలో అందించారు. సాంఘిక, సంక్షేమ, మానవతా దృష్ట్యా అసాధారణ అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు.


ప్రసార భారతి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నవనీత్‌ కుమార్‌ సెహగల్‌ నియమితులయ్యారు.  ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆయనను ఎంపిక చేసింది.  2024 మార్చి 16న నవనీత్‌ కుమార్‌ సెహగల్‌ బాధ్యతలు స్వీకరించారు.


పాలస్తీనా అథారిటీకి ప్రధానిగా మొహమ్మద్‌ ముస్తఫా నియమితులయ్యారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొహమ్మద్‌ ముస్తఫా గతంలో మహమూద్‌ అబ్బాస్‌ వద్ద సలహాదారుగా పనిచేశారు. అలగే పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌వో) సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు