నోటిఫికేషన్స్‌

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ శాశ్వత ప్రాతిపదికన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Mar 2024 00:29 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ శాశ్వత ప్రాతిపదికన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 129.
1. ప్రొఫెసర్‌               2. అడిషనల్‌ ప్రొఫెసర్‌
3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌   4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మొదలైనవి.

అర్హతలు: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, డాక్టరేట్‌ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రొఫెసర్‌/ అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 21-04-2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php 


ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఏయూఈఈటీ 2024ఔ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో పలు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏయూఈఈటీ 2024) ప్రవేశపరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది.

బీటెక్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానం)

సీఎస్‌ఈ - 360, ఈసీఈ - 60, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ - 30,  సివిల్‌ - 30, ఈసీఈ - 30 సీట్లు

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణత (రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము: రూ.1,200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24-04-2024.

వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/default1.aspx?CET=EET

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని