కరెంట్‌ అఫైర్స్‌

 భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

Published : 05 Apr 2024 00:58 IST

మాదిరి ప్రశ్నలు 

 భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

(రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఉత్పత్తిలో 63 శాతం వాటాతో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలోని మంద్‌సౌర్‌ మార్కెట్‌ వెల్లుల్లికి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 75 శాతం వాటా చైనాదే. మన దేశానిది రెండో స్థానం. భారత్‌ నుంచి వెల్లుల్లి అధికంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుంది. దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు ఘాటెక్కడంతో ఇటీవల వార్తల్లో నిలిచింది.)  

 జ: మధ్యప్రదేశ్‌

 ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న హుక్కా కేంద్రాల నిర్వహణపై నిషేధం విధిస్తూ 2024, ఫిబ్రవరి 12న ఏ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ‘సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ) సవరణ బిల్లు - 2024’ను    ఏకగ్రీవంగా ఆమోదించాయి?

(45 నిమిషాల పాటు హుక్కా పీలిస్తే వంద సిగరెట్లు తాగడంతో సమానమని అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీపీ) తన పరిశోధనలో వెల్లడించింది. సిగరెట్‌ తాగిన వ్యక్తి కంటే హుక్కా పీల్చిన వ్యక్తి తొమ్మిది రెట్లు ఎక్కువగా కార్బన్‌ మోనాక్సైడ్‌, 1.7 రెట్ల నికోటిన్‌  
ప్రభావానికి గురవుతున్నట్లు తెలియజేసింది.)

 జ: తెలంగాణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు