ఆహారభద్రతకు నవధాన్య ఆందోళన!

మానవ వికాసం, ఆధునిక అభివృద్ధి పరిణామ క్రమంలో వనరుల వినియోగం అధికమవడం, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, సాంకేతికతల వినియోగం వల్ల సహజ పర్యావరణం క్షీణిస్తోంది.

Published : 07 Apr 2024 01:18 IST

జనరల్‌ స్టడీస్‌ పర్యావరణ అంశాలు
పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ఒప్పందాలు, ఉద్యమాలు

మానవ వికాసం, ఆధునిక అభివృద్ధి పరిణామ క్రమంలో వనరుల వినియోగం అధికమవడం, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, సాంకేతికతల వినియోగం వల్ల సహజ పర్యావరణం క్షీణిస్తోంది. భూగోళాన్ని కాలుష్య కారకాల నుంచి కాపాడి, భవిష్యత్తు తరాలకు సహజ పర్యా వరణాన్ని అందించే లక్ష్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు ఒప్పందాలు, చట్టాలు రూపొంది అమలవుతున్నాయి. కాలుష్య నివారణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడి, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు జరుగుతున్న ఈ సానుకూల పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లో జరిగిన ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

పర్యావరణ కాలుష్యం ఫలితాలైన భూతాపం, ఓజోన్‌ క్షీణత, ఆమ్లవర్షాలు, నేల క్రమక్షయం, జన్యుఆధారిత   కాలుష్యకాలు లాంటి వైపరీత్యాలు మానవాళి మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన  పెరుగుతోంది. 1962లో అమెరికాలోని సిల్వర్‌ స్ప్రింగ్‌ ప్రాంతంలో పంటల చీడపీడల్ని నివారించేందుకు డీడీటీ పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని మలినాలు పంట మొక్కల్లో జీవసాంద్రీకృతమవడం  పర్యావరణాన్ని ఎలా దెబ్బతీసిందో ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త వెల్లడించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి అలవడింది. ఈ క్రమంలో భారతదేశంలోనూ పలు పర్యావరణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు