కరెంట్‌ అఫైర్స్‌

ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాముకాటుకు మెరుగైన విరుగుడును కనుక్కున్నట్లు ఇటీవల ప్రకటించారు? (పాము కాటు వేసినప్పుడు మనిషి రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని వీరు తమ సుదీర్ఘ పరిశోధనలో కృత్రిమంగా సృష్టించడం ద్వారా విజయం సాధించారు.

Published : 07 Apr 2024 01:23 IST

మాదిరి ప్రశ్నలు

  • ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాముకాటుకు మెరుగైన విరుగుడును కనుక్కున్నట్లు ఇటీవల ప్రకటించారు? (పాము కాటు వేసినప్పుడు మనిషి రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని వీరు తమ సుదీర్ఘ పరిశోధనలో కృత్రిమంగా సృష్టించడం ద్వారా విజయం సాధించారు. ఇప్పటివరకు గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారుచేసే పద్ధతినే పాటిస్తున్నారు. సంప్రదాయ విరుగుడు కంటే సరికొత్తగా కనుక్కున్న సింథటిక్‌ యాంటీబాడీ 15 రెట్లు సమర్థంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.)

జ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు

  • దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మరణించిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించి వాటి అర్ధాంతర చావులకు సమగ్ర కారణాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది? (ఇందులో భాగంగా అటవీ, పశు సంవర్థక శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఏనుగుల సంరక్షణకు, వాటి బారి నుంచి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.)

జ: తమిళనాడు

  • 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అంకుర సంస్థలతో పాటు సార్వభౌమ నిధి సంస్థల పెట్టుబడులకు పన్ను రాయితీలను ఎప్పటివరకు పొడిగించింది? (ఈ తేదీ వరకు అంకురాలు, సార్వభౌమ నిధులు, పింఛన్‌ నిధులకు, గిఫ్ట్‌ సిటీలోని కొన్ని పెట్టుబడి సంస్థలకు పన్ను విరామాలను కేంద్రం ప్రకటించింది. అంకుర సంస్థలకు మొదటిసారి పన్ను విరామాలను 2017 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. పదేళ్ల నుంచి వ్యాపారం చేస్తూ, గడిచిన మూడేళ్లలో రూ.100 కోట్లలో టర్నోవర్‌ సాధించిన స్టార్టప్‌లకు ఈ రాయితీ వర్తిస్తుంది.)       

జ: 2025, మార్చి 31






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు