కరెంట్‌ అఫైర్స్‌

2024, ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో జరి గిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ  (జీఈఎఫ్‌) డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా  ఎన్నికైన భారత మహిళ ఎవరు? (ఈ పదవిలో నియామకమైన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా ఈమె ఘనత సాధించారు.)

Updated : 08 Apr 2024 05:37 IST

మాదిరి ప్రశ్నలు

  • 2024, ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో జరి గిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ  (జీఈఎఫ్‌) డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా  ఎన్నికైన భారత మహిళ ఎవరు? (ఈ పదవిలో నియామకమైన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా ఈమె ఘనత సాధించారు.)  

జ: గీతా బాత్రా

  • భారత పార్లమెంట్‌ ఏ సంవత్సరంలో మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించింది? (అపరిష్కృత కేసుల కొండను కరిగించడానికి మధ్యవర్తిత్వ ఆవశ్యకతను ఎన్నడో గుర్తించారు. 1908 నాటి పౌర శిక్షాస్మృతిలోని 89(1) సెక్షన్‌ మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించింది. 1988లో న్యాయ కమిషన్‌ 129వ నివేదిక మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ముందుకు తెచ్చింది. దేశంలో మొదటి మధ్యవర్తిత్వ, సామరస్య సాధన కమిటీ ఏర్పాటుకు ఆదేశించిన ఘనత 2005లో నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌సీ లహోటీకి దక్కుతుంది. మధ్యవర్తిత్వ చట్టం ఆన్‌లైన్‌ మధ్యవర్తిత్వానికి వీలు కల్పిస్తోంది. అందులోని 8, 12 సెక్షన్లు మధ్యవర్తులకు ఉండాల్సిన అర్హతలను నిర్దేశిస్తున్నాయి. వివాదం దాఖలైన 120 రోజుల్లో పరిష్కారం కనుక్కోవాలని, వాది ప్రతివాదులు అంగీకరిస్తే పరిష్కార గడువును 180 రోజుల వరకు పొడిగించవచ్చని మధ్యవర్తిత్వ చట్టం పేర్కొంటోంది.)    

జ: 2023

  • ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ్బనీళీళీతిఖ్శి చేపట్టిన ఈట్ రైట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా 2024, ఫిబ్రవరి చివరినాటికి దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వేస్టేషన్లు, మెట్రో రైల్వేస్టేషన్లు ప్రతిష్ఠాత్మకమైన ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ ధ్రువీకరణను పొందాయి? 

జ:  150, 6



తొలితరం తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతిస్వరూప్‌ (74) 5 ఏప్రిల్‌ 2024న హైదరాబాద్‌లో మరణించారు. ఈయన 1978లో దూరదర్శన్‌లో చేరారు. 1983 నుంచి శాంతిస్వరూప్‌ న్యూస్‌ రీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. టీవీ వార్తలు చదవడంలో ప్రత్యేక ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందారు.


ఆస్ట్రేలియాలోని ‘కామన్వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌’ (సీఎస్‌ఐఆర్‌వో) శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలపై పరిశోధన నిర్వహించారు. సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ పేరుకుపోయిందని, ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రాల్లోకి వచ్చి చేరుతున్నాయని వీరు పేర్కొన్నారు. రిమోట్‌ ఆపరేటెడ్‌ వాహనాలు (ఆర్‌వోవీలు), బోటమ్‌ ట్రాల్స్‌ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్‌ మోడల్స్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.


బ్రిటన్‌కు చెందిన జాన్‌ టినిస్‌వుడ్‌ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందారు. ఈయన వయసు 111 ఏళ్లు. టినిస్‌వుడ్‌ 1912, ఆగస్టు 26న జన్మించారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ వ్యక్తిగా రికార్డు సృష్టించిన జువాన్‌ విసెంటీ పెరీజ్‌ మోరా 2024, ఏప్రిల్‌ 2న మరణించడంతో అప్పటి వరకు ఆయన పేరుతో ఉన్న రికార్డు టినిస్‌వుడ్‌కి దక్కింది.


ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ కమ్యూనిటీ: ది క్లాస్‌ ఆఫ్‌ 2024 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న 40 ఏళ్లలోపు వయసున్న 90 మంది ఇందులో ఉన్నారు. భారత్‌ నుంచి ఆర్‌పీ సంజీవ్‌ గొయెంకా గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ శాశ్వత్‌ గొయెంకా, నైకా ఫ్యాషన్‌ సీఈఓ అద్వైత నాయర్‌, జుబిలెంట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అర్జున్‌ భాటియా, వేదాంతా లిమిటెడ్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రియా అగర్వాల్‌ హెబ్బార్‌, డెక్స్‌టెరిటీ గ్లోబల్‌ వ్యవస్థాపకులు, సీఈఓ శరద్‌ వివేక్‌ సాగర్‌, నటి భూమి పెడ్నేకర్‌ ఈ జాబితాలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు