ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా - ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయడానికి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 17 Jan 2022 00:43 IST

నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా - ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయడానికి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1925
పోస్టులు: అసిస్టెంట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఆడిట్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌), స్టెనోగ్రాఫర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌,  ఎంటీఎస్‌, మహిళా స్టాఫ్‌ నర్స్‌, క్యాటరింగ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేది: 2022, ఫిబ్రవరి 10.
పరీక్ష తేదీలు: 2022, మార్చి 09 నుంచి 11 వరకు.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/


బీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్‌ పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ 2021-2022 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)
మొత్తం ఖాళీలు: 2788 (పురుషులు - 2651, మహిళలు-137)
ట్రేడులు: కాబ్లర్‌, టైలర్‌, కుక్‌, బార్బర్‌, స్వీపర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, ఎలక్ట్రీషియన్‌, వెయిటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో అనుభవం, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 జనవరి 15-21)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


నిన్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 24
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు-13, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు-04, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌-07.
అర్హత: పదో తరగతి, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 02.
చిరునామా: డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, తార్నాక, హైదరాబాద్‌-500007.
వెబ్‌సైట్‌: https://www.nin.res.in/


ఆర్‌సీఐఎల్‌లో 69  పోస్టులు

న్యూదిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఆర్‌సీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 69
పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ మేనేజర్‌-52, మేనేజర్‌-10, సీనియర్‌ మేనేజర్‌-07.
విభాగాలు: టెక్నికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, లీగల్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎల్‌ఎల్‌బీ (ఫుల్‌ టైం), ఎంబీఏ/ పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
చివరి తేది: 2022, ఫిబ్రవరి 23.

వెబ్‌సైట్‌: https://www.railtelindia.com/
 


వాక్‌ఇన్‌

డీఆర్‌డీఓ- డీఐహెచ్‌ఏఆర్‌లో...

చండీగఢ్‌లోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రిసెర్చ్‌ (డీఐహెచ్‌ఆర్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 13
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-09, రిసెర్చ్‌ అసోసియేట్‌-04.
సబ్జెక్టులు: బోటనీ, మైక్రోబయాలజీ, ఫుడ్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌ అర్హత, పరిశోధన అనుభవం.
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: 2022, ఫిబ్రవరి 15.
వేదిక: డీఐహెచ్‌ఏఆర్‌ బేస్‌ ల్యాబ్‌, 3 బీఆర్డీ దగ్గర, ఇండస్టియ్రల్‌ ఏరియా ఫేజ్‌ 2, చండీగఢ్‌ - 160002.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని