KV Results: కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పరీక్ష.. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

KV TGT, PGT Results: కేంద్రీయ విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 22 Apr 2023 05:44 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) ఉపాధ్యాయుల నియామకాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ శుక్రవారం విడుదల చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తంగా 13,404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వీటిలో పీజీటీ 1,409, టీజీటీ 3,176 పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షలకు ఫిబ్రవరిలో రాత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో పాటు కటాఫ్‌ మార్కులు, ఇంటర్వ్యూ తేదీ, వేదికల వివరాలను ఈ కింద ఇచ్చిన పీడీఎఫ్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పీజీటీ పోస్టుల ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్‌ అయినవారి జాబితా కోసం క్లిక్‌ చేయండి 

టీజీటీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్‌ చేయండి 

కటాఫ్‌ మార్కులు, ఇంటర్వ్యూ తేదీలివే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని