NCERT Jobs: ఎన్‌సీఈఆర్టీలో 170 ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు.

Updated : 24 Jan 2024 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (NCERT)లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రూఫ్‌ రీడర్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌, డీటీపీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దిల్లీలో వాకిన్‌లు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్లు/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు వయో సడలింపు ఉంటుంది.

ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలివే..

  • కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 170 పోస్టులను భర్తీ చేస్తుండగా.. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ/పీజీని విద్యార్హతగా పేర్కొన్నారు. నాలుగు నెలల కాల వ్యవధితో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు గత అనుభవం తప్పనిసరి. ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.
  • అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఉద్యోగాలు 60  (ఇంగ్లిష్‌ 25; హిందీ 25, ఉర్దూ 10)  ఉన్నాయి.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారికి 50 ఏళ్ల వయో పరిమితి. నెలకు రూ.80వేలు చొప్పున వేతనం ఇస్తారు.  స్క్రీనింగ్‌, రిజిస్ట్రేషన్‌ ఫిబ్రవరి 1న; స్కిల్‌ టెస్ట్‌ ఫిబ్రవరి 3న దిల్లీలో నిర్వహిస్తారు.
  • ప్రూఫ్‌ రీడర్‌ పోస్టులు 60 (ఇంగ్లిష్‌ 25, హిందీ 25, ఉర్దూ 10) ఉండగా.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి వయో పరిమితి 42 ఏళ్లు. ప్రింటింగ్‌/పబ్లిషింగ్‌ సంస్థలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం అవసరం. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. నెలకు వేతనం రూ.37వేలు. ఫిబ్రవరి 1న స్క్రీనింగ్‌, రిజిస్ట్రేషన్‌, ఫిబ్రవరి 2న స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • డీటీపీ ఆపరేటర్స్‌ పోస్టులు 50(ఇంగ్లిష్‌ 20, హిందీ 20, ఉర్దూ 10) భర్తీ చేయనుండగా ఈ పోస్టులకు వయో పరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. నెలకు వేతనం రూ.50వేలు చొప్పున చెల్లిస్తారు. ఫిబ్రవరి 1న స్క్రీనింగ్‌, రిజిస్ట్రేషన్‌, ఫిబ్రవరి 2,3 తేదీల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకొనేవారు ఇంటర్వ్యూ సమయంలో బయోడేటాతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎంపికైతే వెంటనే ఉద్యోగంలో చేరేందుకు సంసిద్ధత కలిగి ఉండాలి. పూర్తి సమాచారం ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని