TS Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు గడువు పొడిగింపు: ఇంటర్‌ బోర్డు

తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పొడిగించారు. ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

Updated : 01 Sep 2023 19:47 IST

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడిగించారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఈనెల 16వరకు కాలేజీల్లో  చేరవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వరకు ఇంటర్‌ ఫస్టియర్‌లో 4,92,873 మంది చేరారు.  రాష్ట్రంలోని 1285 ప్రైవేటు కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరగా.. 408 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83,177 మంది చేరారు. ఎస్సీ గురుకులాల్లో 16,102 మంది, బీసీ గురుకులాల్లో 14,077 మంది, మైనారిటీ గురుకులాల్లో 10,506, గిరిజన గురుకులాల్లో 8,416, జనరల్‌ గురుకులాల్లో 2,560 మంది విద్యార్థులు చేరారు. గతేడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 4,98,699 మంది చేరారు. 

బైపీసీ అభ్యర్థులకు 2 నుంచి ప్రవేశాల ప్రక్రియ

తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ నెల 4, 5వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 4 నుంచి 7 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఫార్మసీలో 114 కాలేజీల్లో 6,910 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి. ఫార్మ్‌-డి కోర్సులో 61 కళాశాలల్లో 1,192, బయోటెక్నాలజీలో 94, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో 36, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌లో 81 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని