Prajwal Revanna: హాసన సెక్స్‌ స్కాం.. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ!

ప్రజ్వల్‌ రేవణ్ణ స్వదేశానికి తీసుకొచ్చేందుకు బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు.

Published : 05 May 2024 21:28 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ హాసన సెక్స్‌ కుంభకోణం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. వందలాది మంది మహిళల్ని బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రజ్వల్‌ రేవణ్ణను స్వదేశానికి రప్పించేందుకు కర్ణాటక సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనపై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోమంత్రి పరమేశ్వర వెల్లడించారు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ను గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇంటర్‌ పోల్‌ సాయం తీసుకొంటున్నామన్నారు.

ప్రజ్వల్‌ రేవణ్న బాధితులు 500 మంది పైనే?

ఆదివారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ.. ఇప్పటికే నోటీసులు జారీ చేశారని.. ఇంటర్‌ పోల్‌ అన్ని దేశాలకు సమాచారం అందించి ప్రజ్వల్‌ రేవణ్ణ ఆచూకీ తెలుసుకుంటుందన్నారు. ప్రజ్వల్‌ను ఎలా తీసుకురావాలనే అంశంపై ఈ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ కేసులో సిట్‌ అధికారుల పనితీరును హోంమంత్రి ప్రశంసించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిట్‌ చర్యలు చేపడుతోందన్నారు. ఒక నేరానికి సంబంధించిన వ్యక్తిని గుర్తించేందుకు, అతడి కార్యకలాపాల గురించి దాని సభ్యదేశాల నుంచి అదనపు సమాచారం సేకరణకు అంతర్జాతీయ పోలీస్‌ సహకార సంస్థ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు