Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 05 May 2024 21:00 IST

1. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు

 జగన్‌ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి(AP DGP Rajendranath Reddy)పై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని పేర్కొంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలిచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు

సూపర్‌ సిక్స్‌, మోదీ హమీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మూడు కబ్జాలు.. ఆరు సెటిల్‌మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్‌ కల్యాణ్‌

వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్‌లుగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ

భారత సైన్యం (Indian Army) మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేలా చూసి, ఆమె ప్రాణాలను నిలబెట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్‌ అభ్యర్థి

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ (Amethi) నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున కిశోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తనను గాంధీ కుటుంబానికి చెందిన ప్యూన్‌గా భాజపా అభివర్ణించడంపై ఆయన స్పందించారు. తాను రాజకీయవేత్తనని, గాంధీ కుటుంబానికి సేవకుడిని కాదంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్‌-3 ఎవరంటే?

ఒకవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు, రాజకీయ ప్రచారంతో తెలుగు రాష్ట్రాల్లో వేడి మామూలుగా లేదు. సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) నాలుగో విడతలో భాగంగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలూ అదే రోజు జరగనున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా

కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. తొలి రెండు విడతల్లో భాజపా సెంచరీ కొడుతుంది. తెలంగాణలో కొన్నాళ్లుగా భాజపాకు ఓట్ల శాతం పెరుగుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్‌ జైశంకర్‌

నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. పొరుగు దేశాలతో సంబంధాలను కొనసాగించడంలో కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ‘‘మన పొరుగువారితో వ్యవహరించడంలో కొన్నిసార్లు రాజకీయ చిక్కులు ఉంటాయి@@అని జైశంకర్‌ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భారత మార్కెట్‌లో చాలా అవకాశాలున్నాయి: వారెన్‌ బఫెట్‌

భారత మార్కెట్‌లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ మదుపరి, బిలియనీర్‌ వారెన్ బఫెట్ (Warren Buffett) అన్నారు. తమ హోల్డింగ్‌ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే భవిష్యత్తులో వాటిని ఒడిసిపట్టనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై మాట్లాడుతూ కంపెనీ వార్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్‌

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని