నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: నా చిన్నప్పుడు నేను చాలా కష్టపడి పాత ఇనుప సామాను సేకరించి అమ్మి.. అలా అలా... లక్షాధికారినయ్యా.

Published : 14 Sep 2021 00:19 IST

చాలా మంచి పనిచేశారు!

నాన్న: నా చిన్నప్పుడు నేను చాలా కష్టపడి పాత ఇనుప సామాను సేకరించి అమ్మి.. అలా అలా... లక్షాధికారినయ్యా.
చింటు: మంచి పని చేశారు నాన్నా... లేకపోతే ఆ పని ఇప్పుడు నేను చేయాల్సి వచ్చేది.
నాన్న: ఆఁ!!

అవును మరి!

సుశీల: ఏమండీ మన పక్కింటి పింకీకి లెక్కల్లో 99 మార్కులు వచ్చాయి తెలుసా?
సునీల్‌: అవునా! మిగతా ఆ ఒక్క మార్కు ఎక్కడికి పోయినట్లో?
సుశీల: మన అబ్బాయికి వచ్చిందండి!

నిజమే చెప్పాను టీచర్‌!

టీచర్‌: మీ ఊరిలో పుట్టిన ప్రముఖుల పేర్లు చెప్పు బంటీ?
బంటి: మా ఊరిలో ప్రముఖులు పుట్టరు టీచర్‌... అందరూ పిల్లలే పుడతారు.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని