రహస్య సందేశం!

మీరెప్పుడైనా రహస్య సందేశాన్ని మీ స్నేహితులకి పంపారా? చాలా సులభంగా మనకు నచ్చిన  సమాచారాన్ని పంపొచ్చు. ఎలా అంటే?

Updated : 09 Jan 2020 01:30 IST

మీరెప్పుడైనా రహస్య సందేశాన్ని మీ స్నేహితులకి పంపారా? చాలా సులభంగా మనకు నచ్చిన  సమాచారాన్ని పంపొచ్చు. ఎలా అంటే?
దానికి మనకు కావాల్సింది... కాగితం, నిమ్మకాయ రసం, ఒక ఇయర్‌ బడ్‌...
కొంచెం నిమ్మరసాన్ని చిన్న గిన్నెలో తీసుకోండి. దానిలో బడ్‌ని ముంచి పేపరుపై రాయండి. తడి ఆరిపోయాక పేపరుపై ఏ సందేశమూ కనపడదు. కొవ్వొత్తితో వేడిచేయడమో లేదా లైట్‌కి దగ్గరగా పెట్టడమో చేస్తేనే మీ రహస్య సమాచారం తెలిసిపోతుంది. కానీ జాగ్రత్తగా పెద్ద వాళ్ల ముందు చేయండే.


టూత్‌పిక్స్‌తో ఇల్లు...

సరదాగా బొమ్మలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఓ రోజున టూత్‌పిక్స్‌తో ఇల్లు, చెట్టు, సూర్యుడు ఇలా రకరకాల  ఆకారాలు చేశా. 

- బి.నిఖిలేశ్‌, 4వ తరగతి, వైజాగ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని