తమాషా ప్రశ్నలు

  రీటా నీతూ చేతికి 4 జామ, అరటి పళ్లు ఇచ్చింది. అయితే నీతూ చేతిలో ఎన్ని పళ్లున్నాయి?వాహనాలకు ఉండని టైర్లు?పిల్లలు ఉండని స్కూల్‌?

Updated : 30 Jul 2020 00:46 IST

1. రీటా నీతూ చేతికి 4 జామ,
3 అరటి పళ్లు ఇచ్చింది. అయితే నీతూ చేతిలో ఎన్ని పళ్లున్నాయి?
2. వాహనాలకు ఉండని టైర్లు?
3. పిల్లలు ఉండని స్కూల్‌?



క్విజ్‌ క్విజ్‌
1. ఆస్కార్‌ అవార్డును అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి?
2. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి?
3. విటమిన్‌ బి1 లోపం వల్ల కలిగే వ్యాధి?
4. క్రికెట్‌కు సంబంధించి ఐపీఎల్‌ అంటే పూర్తి రూపం?
5. భారత్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?


సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


పొడుపు కథలు
1. వేలెడంత ఉండదు కానీ మనం బయటికి వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా కావాల్సింది ఇదే! ఏంటదీ?
2. దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే, అంత పెద్దది అవుతుంది. ఏంటదీ?
3. వాయువేగాన్ని మించి, లోకాలన్నీ గాలించి, చిటికెలో ఉన్న చోటుకు వచ్చేస్తుంది. ఏంటదీ?
4. వెలుతురులో నీతోటే ఉంటుంది. చీకటిలో తప్పించుకుపోతుంది?




గబగబా అనండి

Each easter eddie eats
eighty easter eggs


జవాబులు: క్విజ్‌ క్విజ్‌:  1. భాను అథయ 2. నాలుగేళ్లకోసారి 3. బెరిబెరి 4. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 5. ఆగస్టు 22 తమాషా ప్రశ్నలు: 1. చేతుల్లో పట్టుకోగలిగినన్ని! 2. సెటైర్లు 3. డ్రైవింగ్‌ స్కూల్‌ చెప్పగలరా!: 1. అన్న, ఇద్దరు తమ్ముళ్లు 2.Today, Tomorrow పొడుపు కథలు : 1. తాళంచెవి 2. గొయ్యి 3. మనసు 4. నీడ  అది ఏది? :  2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని