క్విజ్‌ క్విజ్‌

నీటి అణువులో మూలకాలు ఏవి? వైరస్‌ల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తేది?

Published : 01 Aug 2020 01:30 IST

1. నీటి అణువులో మూలకాలు ఏవి?
2. వైరస్‌ల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
3. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తేది?
4. వియన్నా ఏ దేశ రాజధాని?
5. టెలిస్కోపును కనిపెట్టిన శాస్త్రవేత్త?



చుక్కలు కలపండి


తమాషాప్రశ్నలు
1. మైదానంలో ఆడుకుంటున్న సోమూని కోపంగా టీచర్‌ పిలిచారు. వెంటనే సోమూ ఏంచేశాడు?
2. అప్పుడే షాపు నుంచి తెచ్చిన కొత్త బట్టల మీద ఆపిల్‌ జ్యూస్‌ పడితే ఏమవుతుంది?
3. జంతువులు, మనుషులు ఇది తాగకపోతే బతకలేరు. కానీ ఏది తాగాలన్నా ఇది ఉండాల్సిందే!?


పొడుపు కథలు
1. గాజు పంజరంలో మిణుగురు పురుగు. పగలు నిద్రపోయి, రాత్రిళ్లు జాగారం చేస్తుంది.
2. కాంచిపురం నలుపు, చెన్నపట్నం ఎరుపు పగలకొడితే పప్పు, తింటే చేదు.
3. కళకళమెరిసే కళ్లు, తళతళలాడే కళ్లు... కళ్లు సుందరమే కాని, కనపడని కళ్లు!!
4. కోనయ్య చెరువులో, మీనయ్య బర్రెను కొంటే కొమ్ములతో నెమరువేస్తుంది.


లెక్క తేల్చండి?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


జవాబులు: పొడుపు కథలు: 1. బల్బు 2. గురివింద గింజ 3. నెమలి ఈకలు 4. చేట తమాషాప్రశ్నలు: 1. పరుగున టీచర్‌ దగ్గరికి వచ్చాడు. 2. తడిసిపోతాయి. 3. దాహం క్విజ్‌ క్విజ్‌: 1. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌
2. వైరాలజీ 3. నవంబరు 11, 1918 4. ఆస్ట్రియా 5. గెలీలియో కవలలేవి?: 1, 2
లెక్క తేల్చండి?: 172 ; పైనాపిల్‌: 8, పుచ్చకాయ: 6, స్ట్రాబెర్రీ: 10


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని