Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,276

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది.

Published : 08 May 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో మారుతీ, రిలయన్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా ప్రధాన సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.3,668.84 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,304.50 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు