పొడుపు కథలు

కోక లేదు. సీత కాదు. రామ చిలుక కానే కాదు.. ఏంటది?

Published : 12 Aug 2020 01:04 IST

1. కోక లేదు. సీత కాదు. రామ చిలుక కానే కాదు.. ఏంటది?

2. మొదట చప్పన, మధ్య పుల్లన, చివర కమ్మన...

3. చెట్టుకు కాయని కాయ.. కరకరలాడే కాయ..

4. తమ్ముడు బంగురుతూ ఒక్క గది దాటేసరికి, అన్న పరుగెత్తుతూ పన్నెండు గదులు పోతాడు

5. పెంకు విరిచి తింటాం. గుడ్డు కాదు...


1. లవంగాల ద్వీపం అని దేన్ని పిలుస్తారు?

2. హ్యారీ పాటర్‌ సృష్టికర్త ఎవరు?

3. హెలికాప్టర్‌ను కనుగొన్నదెవరు?

4. లోకమాన్య అనే బిరుదు ఎవరిది?

5. కథకళి ఏ రాష్ట్ర నాట్యరూపం?


అవునా? కాదా?

1. భాంగ్రా ఒడిశా గిరిజన నృత్యం.

2. గ్లోబల్‌ వార్మింగ్‌కి కార్బన్‌ డయాక్సైడ్‌ కారణం.

3. గుండెకి సంబంధించి అధ్యయనం చేసేది కార్డియాలజీ.


చిన్నూ కబుర్లు

1. మనిషి దంతాలు ఇంచుమించు షార్క్‌ దంతాలంత దృఢంగా ఉంటాయి.

2. కొన్ని జాతుల రొయ్యల్లో గుండె వాటి మెదడులో ఉంటుంది.

3. స్లాత్‌ అనే జీవికి తిన్నది అరగడానికి రెండు వారాలు పడుతుంది.


నేనెవర్ని

పగలు అసలు నాకు నచ్చదు. రాత్రి వెన్నెల్లా విరుస్తాను. నా విహారం ముగిశాక నేల మీద సేదదీరతాను. అప్పుడు నన్నెత్తుకునిపోతారు అందరూ. నేనెవర్ని?


లెక్క తేల్చండి


తమాషా ప్రశ్నలు

* ముందు నుంచి బరువుగా ఉంటాను. వెనక నుంచి మాత్రం కాదు.. నేనెవరు?

* ఎనిమిదితో సున్నా ఏమంటుంది?

* ఎరుపు రంగు చూస్తే స్టార్ట్‌ చేస్తాం. ఆకుపచ్చ రంగు చూస్తే ఆగిపోతాము... ఎక్కడబ్బా?


గబ గబ అనండి

అరువు బరువే వీపు దరువే పోవు పరువే జరుగు చెరువే కొరివి గురువే!




ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.


జవాబులు

పొడుపు కథలు

1.సీతాకోకచిలుక 2.పాలు, పెరుగు, నెయ్యి 3.కజ్జికాయ, 4.గడియారం  5.చింతపండు

క్విజ్‌ క్విజ్‌

1.జాంజిబార్‌, 2.జేకే రౌలింగ్‌, 3.బ్రెక్వెట్‌ 4.బాలగంగాధర తిలక్‌ 5.కేరళ

అవునా? కాదా?

1.కాదు. పంజాబ్‌ నృత్యం.2.అవును, 3.అవును

నేనెవర్ని?

పారిజాతం పూలు
లెక్క తేల్చండి

సమాధానం: 10, టీకప్పు - 5 ఐస్‌క్రీం బౌల్‌ - 15, పుల్ల ఐసు - 25, కోన్‌ ఐస్‌క్రీం - 1

తమాషా ప్రశ్నలు

1. ఇంగ్లిష్‌ పదం TON.

2. రెండు చుట్లు ఉన్న నువ్వు ఎనిమిది అయితే, ఒక్క చుట్టు ఉన్న నన్ను నాలుగు అని పిలవాలి కదా అంటుంది.

3. పుచ్చకాయ తినేటప్పుడు.


సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని