నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ ఏబీసీడీలు చెప్పు?

Updated : 29 Oct 2021 06:38 IST

క్లారిటీ కావాలిగా!

టీచర్‌: చింటూ ఏబీసీడీలు చెప్పు?

చింటు: కాపిటల్‌ లెటర్స్‌లో చెప్పాలా?.. స్మాల్‌ లెటర్స్‌లో చెప్పాలా? టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: ఏంటి సన్నీ.. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు.

సన్నీ: బుక్‌ చూసి చెప్పొచ్చా టీచర్‌?

టీచర్‌: నో.. కుదరదు.

సన్నీ: మేం ఏదైనా డౌట్‌ అడిగితే మాత్రం మీరు బుక్‌లో వెతికి చెప్పొచ్చు. మేం మాత్రం అలా చేయడానికి వీల్లేదంటారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని