వ్యర్థాలతో వింతలు!

అయిదుగురు కళాకారులు.. ఏడుగురు సహాయకులు.. యాభైమంది పనివాళ్లు... ఎనభై టన్నుల వ్యర్థాలు... ఆరునెలల కాలం.. ఫలితం ఏడు వింతలు! కాస్త అయోమయంగా ఉంది కదూ నేస్తాలూ! ఇంతకీ విషయం ఏంటంటే..

Published : 23 Aug 2021 00:52 IST

అయిదుగురు కళాకారులు.. ఏడుగురు సహాయకులు.. యాభైమంది పనివాళ్లు... ఎనభై టన్నుల వ్యర్థాలు... ఆరునెలల కాలం.. ఫలితం ఏడు వింతలు! కాస్త అయోమయంగా ఉంది కదూ నేస్తాలూ! ఇంతకీ విషయం ఏంటంటే.. పనికి రాని వస్తువులతో ఎంతో కష్టపడి ఏడు ప్రపంచ వింతలను సృష్టించారు. ఇంతకీ ఎక్కడో చెప్పనేలేదు కదూ.. దిల్లీలో! మరిన్ని వివరాలు తెలుసుకుందామా!

తాజ్‌మహల్‌, ఈఫిల్‌ టవర్‌, స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, టవర్‌ ఆఫ్‌ పీసా, గీజా పిరమిడ్‌.. ఇలా ప్రపంచ వింతలన్నీ ఒక్క చోటే ఉంటే అవీ వ్యర్థాలతో తయారైనవైతే భలేగా ఉంటుంది కదూ. దిల్లీలో అచ్చం ఇలాంటి ప్రదేశమే ఉంది. దాని పేరే ‘వేస్ట్‌ టు వండర్‌’.


ఒకప్పుడు డంపింగ్‌యార్డు

ప్రస్తుతం ‘వేస్ట్‌ టు వండర్‌’ ఉన్న ప్రాంతం ఒకప్పుడు డంపింగ్‌ యార్డు. దాదాపు కొండను తలపించేది. అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలకు ఓ రూపం ఇద్దామని అనుకున్నారు అధికారులు. అనుకున్నదే ఆలస్యం ఆచరణలో పెట్టారు. కానీ అనుకున్నంత సులువు మాత్రం కాదు. చాలా శ్రమ కోర్చిన తర్వాత ఇదిగో ఇలా రూపుదిద్దుకుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు 7.5కోట్లకు పైగానే ఖర్చు తేలింది. అయితేనేం ప్రస్తుతం దిల్లీలోని దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. మనం కూడా ఎంచక్కా... పాస్‌పోర్టు, వీసా లేకుండానే ప్రపంచ వింతలన్నింటినీ ఒకే చోట చూసేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని