హ్హ... హ్హ... హ్హ!

టీచర్‌: గ్రహాలన్నీ వేటి కక్ష్యల్లో అవి నిర్ణీత దూరం పాటిస్తూ తిరగడానికి గల కారణం ఏంటి లిల్లీ?

Updated : 11 Sep 2020 01:33 IST

టీచర్‌: గ్రహాలన్నీ వేటి కక్ష్యల్లో అవి నిర్ణీత దూరం పాటిస్తూ తిరగడానికి గల కారణం ఏంటి లిల్లీ?

లిల్లి: అవి ఎప్పటి నుంచో ‘సామాజిక దూరం’ పాటిస్తున్నాయి టీచర్‌!

ఆంటీ: జున్నూ.. అంత ఎండలో ఆడుకుంటున్నావేంటి? చూడు చెమటలు ఎలా పడుతున్నాయో.. వెంటనే ఇంట్లోకి వెళ్లు!

జున్ను: మీలాగ నీడపట్టున ఉంటే ఎలా ఆంటీ. మన శరీరానికి ‘డి’ విటమిన్‌ కావాలా వద్దా? మీరూ నాతో పాటు వచ్చి ఈ ఎండలో ఆడుకోండి ఆంటీ..

ఆంటీ: ఆఁఁ

- ఎమ్‌.హన్విక్‌, ఒకటో తరగతి, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని