Published : 14 Dec 2021 00:32 IST

చిత్రం చూసి చెప్పేయ్‌!

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


తమాషా.. తమాషా!

ఆధారాల సాయంతో గళ్లను పూరించండి.


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..

1. వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ ఎవరు?
2. టర్కీ రాజధాని ఏది?
3. రోడ్డుపైన వాననీటిని పాదచారుల పైకి చిమ్మేలా వాహనాన్ని నడిపే డ్రైవర్లకు ఏ దేశంలో జరిమానా విధిస్తారు?
4. భారత దేశంలోని ఏ రాష్ట్రాన్ని ‘హార్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు?
5. సౌరకుటుంబంలో ఏ గ్రహాన్ని ‘బ్లూ ప్లానెట్‌’ అని పిలుస్తారు?
6. ఏ సముద్రపు జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది?


మా పేర్లు చెప్పుకోండి!

ఇక్కడ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా చదివి.. అవేంటో కనిపెట్టండి చూద్దాం!

1. హలో.. నిన్నే ఒక్కసారిగా ఆగి.. రివ్వున అలా సైకిల్‌ మీద దూసుకుపోతే ఎలా?
2. మా పెద్ద అన్నయ్య పేరుకే కవి.. తప్పులే రాస్తాడు  అన్నీ...!
3. ఎంత వద్దని చెప్పినా.. నిన్ను మీ అమ్మ బయటకు పంపుతోంది.  
4. కాస్త ఇటు రా.. జున్ను ముక్క తిందువుకానీ..
5. మధురమైన పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది.
6. మనసు.. మనసులో లేనప్పుడు... కాస్త అలా పార్కుకు వెళ్లి వస్తే హాయిగా ఉంటుంది.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

అఖండ విజయం, జైత్రయాత్ర, దండయాత్ర, విహారయాత్ర, యుద్ధమేఘాలు, శంఖారావం, సమరశంఖం, పాదయాత్ర, ఉపన్యాసం, విన్యాసం, అస్త్ర సన్యాసం, ఉపవాసం, వనవాసం, విశ్వాసం, విశ్వాస పరీక్ష, అణుపరీక్ష, విషమ పరీక్ష, విజయం


ఒక చిన్నమాట!

When you know better, you do better.

మీకు ఏదైనా విషయం మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే... ఆ పని చక్కగా చేయగలరు.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రం చూసి చెప్పేయ్‌! :  1. FATHER 2.PIE 3.COWBOY 4.LIGHTHOUSE

తమాషా.. తమాషా..!: 1. example  2.couple 3.people 4. pineapple  5.sample 6.purple 7.principle  8.please 9.pleasure 10.plenty

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 3, 4, 8 తప్పులు: 1 (వాయుసేన), 2 (వాతావరణం), 5 (వ్యవసాయం), 6 (వాయుగుండం), 7 (హిమపాతం)

క్విజ్‌.. క్విజ్‌..: 1.విరాట్‌ కోహ్లి 2.అంకారా 3.జపాన్‌ 4.మధ్యప్రదేశ్‌ 5.భూ గ్రహం 6.ఆక్టోపస్‌

కవలలేవి?: 2, 4

మా పేర్లు చెప్పుకోండి!:  1.గిరి 2.కవిత 3.నాని 4.రాజు 5.మధు 6.సుమ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు