logo

ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?

రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు.

Updated : 07 May 2024 09:20 IST

భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

పెద్దమండ్యం, న్యూస్‌టుడే : రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. పెద్దమండ్యం మండలం తురకపల్లె, కలిచెర్లలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా సీనియర్‌ నేత చల్లపల్లి  నరసింహారెడ్డి, సినీ నటుడు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడారు. సమస్య అడిగినందుకు నిండు గర్భిణిపై నిర్ధాక్షిణ్యంగా దాడి చేసిన వైకాపా నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సైకోలకు మరోసారి అవకాశమిస్తే మీ మీద మీకే హక్కు లేకుండా చేస్తారని వ్యాఖ్యనించారు. ముస్లిం మైనార్టీల్లో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనే అన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం సినీనటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ కనిపించే మూడు సింహాలు మోడీ, అమిషా, నడ్డా అయితే కనిపించని నాలుగో సింహమే కిరణ్‌కుమార్‌రెడ్డి అని అన్నారు.  ఈ సందర్భంగా శివపురం ఎంపీట©సీసభ్యుడు రుక్మాంగధరెడ్డి భాజపాలో చేరారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌, ప్రచార సమన్వయకర్త మల్లికార్జున నాయుడు, బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌, నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, ప్రసాద్‌, నాగేశ్వర్‌రెడ్డి, మహేష్‌, నాగేశ్వర్‌, లక్ష్మీనారాయణ, గంగాధర్‌ పాల్గ్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని